గాడిద పై ఊరేగింపు : గుండు గీయించుకొని నిరసన : ప‌్రత్యేక హోదా కోసం..
వినూత్న నిరసనలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరో సారి వార్తల్లో నిలిచా రు. ఏపికి పత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు చేస్తున్న నిరసనలకు మద్దతుగా బంగి అనంతయ్య వినూత్న నిరసన నిర్వహించారు. కర్నూలు నగరంలో బంగి అనంతయ్య నిర్వహించిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.
కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య కర్నూలు నగరంలో వినూత్న నిరసన వ్యక్తం చేసారు. ఏపికి ప్రత్యేక హో దా ఇవ్వాలని కోరుతూ నిరసనకు దిగారు. నగరంలోని బుధవార పేట నుండి కలెక్టరేట్ వరకూ గాడిద పై ఊరేగారు. ఆ తరువాత ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుండు గీయించుకున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ఏపిలోనూ ప్రతీ ఒక్కరూ మద్దతూ ఇవ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో బిజెపి కి పుట్టగతులు ఉండవని బంగి అనంతయ్య హెచ్చరించారు.

టిడిపి ఏ కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ వేషధారణలో బంగి అనంతయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రాష్ట్ర విభజన సమయంలోనూ బంగి అనంతయ్య ఇటువంటి వినూత్న నిరసనలు నిర్వహించారు. ఇక, టిడిపి ఎంపి శివప్రసాద్ పార్లమెంట్ సమావేశాల సమయంలో రోజుకో వేష ధారణతో తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముందు శివ ప్రసాద్..కర్నూలు లో బంగి అనంతయ్య ఇప్పుడు వార్తలో నిలిచారు.












Click it and Unblock the Notifications