Viral Pic: వోన్నో.. జగన్‌కు చేసింది చెప్పుకోడం చేతకాడం లా..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును పొందుపరుస్తూ పలుచోట్ల బ్యానర్లు, హోర్డింగులు వెలుస్తోన్నాయి. సంపద సృష్టి విషయంలో ఇటీవలే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమగ్ర వివరాలను ఇందులో రాసుకొచ్చారు.. దీన్ని కట్టిన వాళ్లు.
ఎవరి పేరు కూడా ఈ బ్యానర్లల్లో లేకపోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఫలానా పార్టీ అని ఎక్కడ కూడా చెప్పుకోకుండా ఆర్థిక సంవత్సరం, కేంద్రం ఇచ్చిన గణాంకాలను బేరీజు వేస్తూ వాటికి సంబంధించిన వివరాలను ఇందులో ముద్రించారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వెలిసినట్లుగా తెలుస్తోంది.

జగన్‌కి చేసింది చెప్పుకోడం చేతకాడం లా.. అనే అక్షరాలు కడప స్లాంగ్‌లో ఈ బ్యానర్ పైభాగంలో పెద్దగా ముద్రించారు. దాని కింద ఓ టేబుల్ వేసి, గత చంద్రబాబు ప్రభుత్వంలో చివరి ఆర్థిక సంవత్సరం 2018- 2019, వైఎస్ జగన్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరం 2023-2024లో రాష్ట్రంలో నమోదైన వార్షిక అభివృద్ది రేటును పొందుపరిచారు.
ఈ లెక్కలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానాలే. రాజ్యసభ సాక్షిగా గత అయిదేళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్నా.. కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా అన్నిట్లో కలుపుకొని 2018- 2029కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్క (ఆదాయం)ను జగన్ సృష్టించాడని ఇందులో వివరించారు.
2018- 2019 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా.. 2023- 2024 నాటికి అంటే జగన్ హయాంలో ఈ సంఖ్య 12.91 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఈ బ్యానర్‌లో వివరించారు. సంపద సృష్టించడం అంటే ఇది కదూ మరి అని రాశారు.
చివర్లో వోన్నో ఈ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి నాకు ఏం సంబంధం లా.. ఏదో ఫ్రెండ్‌షిప్ కొద్ది చెప్తావుండా అంతే..అని ముగించారు. ఈ బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు దీనిపై కామెంట్స్ పెడుతున్నారు. జగన్‌కు చేసింది చెప్పుకోవడం చేతకాలేదంటూ వ్యాఖ్యానిస్తోన్నారు. దీన్ని ఎవరు కట్టారనేది తెలియరావట్లేదు.












Click it and Unblock the Notifications