ఐనా కనుమూరి రిజైన్ చేయట్లేదు, వీఐపీ దర్శనం రద్దు'

ఆన్‌లైన్ బుకింగ్ అమలులోకి రాగానే వీఐపీ టెకెటింగ్‌ను రద్దు చేస్తామన్నారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ఉండొద్దనేది తమ అభిప్రాయన్నారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కానివ్వమన్నారు. ప్రధాన దేవాలయాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని మాణిక్యాల రావు కొద్ది రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. పదవి నుంచి తప్పుకోకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటారని ఆయన అప్పుడు హెచ్చరించారు.
యూపీఏ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇంకా పదవులు పట్టుకు వేళ్ళాడడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications