భూమి ఇస్తే ఎపి రాజధానిలో యూనిట్: బాలకృష్ణ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో 36 ఎకరాలు కేటాయిస్తే అక్కడ కూడా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు హాస్పిటల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ని సోమవారం ఉదయం ఆయన కలిశారు. సమావేశంలో భాగంగా హిందూపురం ఆస్పత్రి అభివృద్ధిపైనా చర్చించారు. ఎపి రాజధానిలో భూమి కేటాయించాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

Basavatarakam cancer hospital unit at AP capital

ఎపిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ స్థాపన విషయంపై తాను ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తనను గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తానని, అక్కడి ప్రజలకు సేవలందిస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+