గోరంట్ల వివాదం-జగన్ తగ్గనిది-చంద్రబాబు వదలనిదీ అందుకే ! ఏం జరిగినా టర్నింగే ?
ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత టీడీపీ విమర్శల తీవ్రత పెంచింది. దీంతో వైసీపీ కూడా దీనిపై తగ్గకూడదని నిర్ణయించుకుని ఎదురుదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఈ వీడియో వ్యవహారాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నాయనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

గోరంట్ల వీడియో రచ్చ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో మాట్లాడుతూ దొరికిపోయిన వ్యవహారం రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ, టీడీపీ మధ్య నడుస్తున్న వార్ కు మరింత ఆజ్యం పోసింది. ఈ వీడియో ఒరిజినల్ అయితే కాదని, అసలు వీడియో దొరికితే ఫోరెన్సిక్ కు పంపుతామని ఎస్పీ ఫకీరప్ప చేసిన ప్రకటన ఇరు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి కారణమైంది. అయితే అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈ వీడియోను పంపి ఒరిజినల్ అని వచ్చిన రిపోర్ట్ తో టీడీపీ విమర్శలకు పదునుపెట్టింది. అయితే దీన్ని వైసీపీ మాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు ఎస్పీ ఫకీరప్ప ప్రకటన తర్వాత మాధవ్ కమ్మ సామాజిక వర్గంతో పాటు చంద్రబాబుపై బూతు విమర్శలకు దిగారు.

పట్టు వదలని టీడీపీ
మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై టీడీపీ మాత్రం పట్టు వదలడం లేదు. ఈ వీడియోను టీడీపీ అనుకూల ఏబీఎన్ ఛానల్లోనే తొలుత ప్రదర్శించారంటూ పోలీసులు చెబుతున్నా.. టీడీపీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. నగ్న వీడియోతో దొరికిపోయిన వైసీపీ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు పార్లమెంటులోనూ దీన్ని రచ్చ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, జాతీయ మహిళా కమిషన్ స్పందన నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో ఇది ఒరిజినల్ అని తేలిందని, కాబట్టి మాధవ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

వైసీపీ ఎదురుదాడి
వైసీపీ మాత్రం ఆరంభంలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించినా.. ఆ తర్వాత టీడీపీ విమర్శలతో రూటు మార్చింది. టీడీపీ విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఎస్పీ ఫకీరప్పతో ఇది ఒరిజినల్ కాదని చెప్పించేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని మాధవ్ టీడీపీపై, కమ్మ సామాజిక వర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు, ప్రభుత్వంలో పెద్దలు కూడా ఇప్పుడు మాట మార్చి మాధవ్ ను టీడీపీ టార్గెట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీంతో మాధవ్ సేఫ్ అయిపోయినట్లే కనిపిస్తోంది.

జగన్, చంద్రబాబు పట్టు వెనుక ?
బీసీ సామాజిక వర్గానికి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోతో దొరికిపోయి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మార్ఫింగ్ ఆరోపణలు చేశారు. అయినా అవి నిరూపణ కాలేదు. అదే సమయంలో మాధవ్పై చర్యలు తీసుకుంటే టీడీపీని కాదని తొలిసారి తమ పార్టీవైపు మొగ్గిన బీసీలకు ఎక్కడ కోపం వస్తుందనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మాధవ్ పై చర్యలకు వైసీపీ వెనుకాడుతోంది. అదే సమయంలో మాధవ్ పై చర్యలు తీసుకునేలా జగన్ పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయితే అప్పుడు బీసీ అయిన మాధవ్ ను టార్గెట్ చేశారంటూ ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మాధవ్ వ్యవహారాన్ని జగన్, చంద్రబాబు ఇలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు అర్దమవుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications