హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ ట్రాజెడీ: మరో నాలుగు మృతదేహాలు లభ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాన్‌ నదిలో ఆదివారం నాలుగు మృతదేహాలు లభించాయి. మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించింది. వారిని హైదరాబాద్‌ నల్లకుంటకు చెందిన రుత్విక్‌తో పాటు వరంగల్‌ జిల్లా నర్సంపేట, గీర్మాజీపేటలకు చెందిన పరమేశ్వర్‌, మిట్టపల్లి అఖిల్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్‌లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదం డ్రులకు తెలియజేసిన అధికారులు ఈ రాత్రికి మృతదేహాలను హైదరాబాద్‌కు తరలి స్తున్నట్లు చెప్పారు.

ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని బియాన్‌ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంతో చర్చించి సహాయక చర్యలను తక్షణమే చేపట్టేలా చేశాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గాలింపు చర్యల్లో మొదటి మూడు రోజుల పాటు దాదాపు 9 మం ది విద్యార్థుల ఆచూకీ లభించింది. ఆ తర్వాత గాలింపు చర్యలు మందగించడం, గాలింపునకు పలు రకాల ఆటంకాలు ఏర్పడడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను తమకు అప్పగించడంతో హిమాచల్‌ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా అక్కడే వున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఇక తమ పిల్లల ఆచూకీ లభించేలా లేదని అనుమానించి అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

గత మూడు రోజులుగా వరుసగా విద్యార్థుల మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో మరో ఎనిమిది మృతదేహాల ఆచూకీ లభించింజి. దీంతో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థుల ఆచూకీ లభించగా ఇంకా ఏడుగురు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి వుంది.

Beas tragedy: Four more bodies recovered

English summary

 Four more bodies were recovered from Beas river on Sunday, fourteen days after 25 people, including 24 engineering students from Hyderabad, were swept away in the river on June 8, taking the number of those found to 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X