బియాస్ ప్రమాదం: మంచుకొండలు కరిగి.. (పిక్చర్స్)
మండి: మంచుకొండలు కరిగి బియాస్ నదిలో వరద ప్రవాహం పెరడంతో విద్యార్థుల గాలింపు చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వాధికారి లవ్ అగర్వాల్ చెప్పారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థులకు సంబంధించి మరో మృతదేహం లభ్యమైందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి. మహేందర్ రెడ్డి చెప్పారు.
విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్ విఎన్నార్ కళాశాల విద్యార్థుల్లో 24 మంది బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజుల్లో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా శుక్రవారం సాయిరాజ్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీంతో 13 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి.
మరో 11 మంది విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. నాలుగు మృతదేహాలను ఢిల్లీ మీదుగా విమానంలో హైదరాబాద్ పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అదనపు డిజిపి రాజీవ్ త్రివేది కూడా సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

గాలింపు చర్యల పరిశీలన
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి బియాస్ నదిలో విద్యార్థుల ఆచూకీ కోసం జరుగతున్న గాలింపు చర్యలను అధికారులతో కలిసి పరిశీలించారు.

అధికారులతో కలిసి...
అధికారులతో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి బియాస్ నదిలో విద్యార్థుల కోసం జరుగుతున్న గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

అధికారులతో మహేందర్ రెడ్డి
లవ్ అగర్వాల్ ఇతర ప్రభుత్వాధికారులతో గాలింపు చర్యలపై సమీక్ష జరుపుతున్న తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి

దుర్పిణీతో ఇలా..
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి గాలింపు చర్యలను ఇలా దుర్భీణీలో చూస్తూ కనిపించారు.












Click it and Unblock the Notifications