ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల విద్వేషాలకు కారణం ప్రధాని మోడినే : ఏపి సీఎం చంద్రబాబు నాయుడు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ఏపి సీఎం చంద్రబాబు నాయుడు మరోసారీ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ రామ్‌నగర్ లో ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన మోడీ చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ విభజన అంశాలను బీహార్‌లో మాట్లడడం వెనక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడి వ్యవహరించిన తీరువల్లే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు కారణమయ్యాని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. విభజన హామీలపై అయిదు సంవత్సరాల్లో ఒక్కసారైన రెండు రాష్ట్రాలను సమావేశపరిచారా అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీకి గుజరాత్ తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ది కనపడడం లేదని ఆయన మండిపడ్డారు.
గుజరాత్ ను మించిపోతామనే భావనతోనే ఏపికి నిధులు రాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. అయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాల తెలివైన వారని బీహార్ , గుజరాత్ రాష్ట్రాలను మించి అభివృద్ది సాధిస్తారని అన్నారు. ఓవైపు 98 శాతం విభజన హమీలను నెరవేర్చామని చెబుతున్న ప్రధాని తాము అడిగితే ఇంకా పదేళ్లు పడుతుందని ఎలా చెప్పారని ప్రశ్నించారు. మోడి కేవలం మాటలు తప్ప, చేతల్లో చేసిందేమి లేదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినప్పటికి ప్రజలను అవమానపరిచేందుకే ప్రచారం చేశారని దుయ్యబట్టారు.

మరోవైపు వైఎస్ఆర్‌పీని గట్టేక్కించేందుకు ఏపిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాన్ని కొనసాగించారని ఆరోపణలు గుప్పించారు. గత అయిదు సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్యను ఆయన పరిష్కరించలేదని అన్నారు. మోడీని గౌరవంగా అమరావతి నిర్మాణానికి ఆహ్వానిస్తే.. ఆయన మాత్రం మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లారని మరోసారి ఎద్దేవా చేశారు. ఇక కేంద్రంలో సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ లో సమీక్షలు నిర్వహిస్తే తప్పవుతుందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈనేపపథ్యంలోనే పోలవరం విజిట్ కు సోమవారం వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. పోలవరం పై సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications