ఆలయానికి రూ.1.2 లక్షలు ఇచ్చిన బిచ్చగాడు, అన్నదానం కూడా..
విజయనగరం జిల్లాలో ఓ యాచకుడు ఓ గుడికి రూ.1.2 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి అతను అందించాడు. ఆ గుడి శివాలయం. యాచకుడి పేరు కామరాజు.
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఓ యాచకుడు ఓ గుడికి రూ.1.2 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి అతను అందించాడు. ఆ గుడి శివాలయం. యాచకుడి పేరు కామరాజు.
అతను జిల్లాలోని చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయం ఆవరణలో దశాబ్దాలుగా యాచన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గుడికే విరాళం ఇచ్చాడు.
ఆలయ ఆవరణలో షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. షెడ్లు లేక భక్తులు ఎండలో నిలబడాల్సి వస్తోందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీ నిర్ణయం తెలుసుకున్న కామరాజు వాటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.1.2 లక్షలు తాను ఇస్తానని చెప్పాడు. బ్యాంకు నుంచి రూ.60 వేలు తీసుకొచ్చి గుడి పెద్దలకు అందించాడు. మొత్తం డబ్బును ఒకేసారి అధికారులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతను మిగతా సొమ్మును మరో ఒకటి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పాడు.
అంతేకాదు, షెల్టర్లు పూర్తయ్యాక పది వేల రూపాయలు ఖర్చు చేసి అన్నదానం చేస్తానని చెప్పాడు. ఆయన ఆరు దశాబ్దాలుగా ఏళ్ల క్రితం చీపురులల్లి వచ్చి, శివాలయం వద్దే ఉంటూ, యాచిస్తున్నాడు.












Click it and Unblock the Notifications