చంద్రబాబుతో లగడపాటి భేటీకి పొలిటికల్ కలర్: మీడియా కథలేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇటీవల విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన ఎందుకు కలిశాడో లగడపాటి అప్పుడే చెప్పారు.

2019 షాక్: కేశినేని నానికి షాక్, బాబుతో లగపాటి భేటీ వెనుక.. ఏం జరుగుతోంది?

బోండా ఉమ ఇలా...

బోండా ఉమ ఇలా...

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా స్పందించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలవడం వెనుక వ్యాపార కారణాలే తప్ప, రాజకీయ అంశాలు లేవని ఉమ తేల్చి చెప్పారు.

ప్రకటన విడుదల చేస్తే..

ప్రకటన విడుదల చేస్తే..

అయితే, మీడియా అల్లుతున్న గాలి వార్తలకు తెరదించేందుకు రేపో మాపో లగడపాటి ఓ ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందని కూడా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. తాను క్యాజువల్‌గానే కలిశానని లగడపాటి ఆ రోజు చెప్పారు.

ఆశ్చర్యపోయిన మీడియా

ఆశ్చర్యపోయిన మీడియా

వెలగపూడి సచివాలయంలో లగడపటి ప్రత్యక్షం కావడంతో అప్పుడు మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎందుకు వచ్చారని అడగగా.. సచివాలయం చూశానని, చాలా బాగుందని, ముఖ్యమంత్రిని ప్రశంసించానని, తనకు ల్యాంకో పని కూడా ఉందని, కలిసి మాట్లాడుదామని వచ్చానన్నారు. తాను రాజకీయాల్లో లేనని, తనకు సంబంధం లేదని కూడా చెప్పారట.

రూమర్స్

రూమర్స్

అయినప్పటికీ లగడపాటి - చంద్రబాబుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. లగడపాటి రాజకీయాల్లోకి వస్తారా? 2019లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా? కేశినేని నానికి చెక్ చెప్పినట్లేనా? అనే చర్చ జరిగింది. అయితే, కేవలం వ్యాపరపరంగానే కలిశారని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Behind Former MP Lagadapati Rajagopal meet Andhra Pradesh chief Minister Chandrababu Naidu!
Please Wait while comments are loading...