డేంజర్ జోన్ లో బెజవాడ ... ఆ అధ్యయనంలో వెల్లడి
Recommended Video
విజయవాడకు పెను ప్రమాదం పొంచి ఉంది. విజయవాడ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ,కేంద్ర ప్రభుత్వం కలిసి రూపొందించిన రిపోర్టులో బెజవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని వెల్లడైంది. మొత్తం దేశవ్యాప్తంగా 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో బెజవాడ సైతం ఉండటం ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

బెజవాడకు భూకంప ముప్పు ఉందన్న అధ్యయనం
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్,నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భూకంప ప్రభావం ఉండే ప్రాంతాలపై అధ్యయనం చేసింది.ఇక వీరితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ భూకంప ప్రభావిత ప్రాంతాల సూచికలతో రిపోర్ట్ రెడీ చేసింది.ఈ రిపోర్టులో ఏపీ రాజధాని నగరమైన విజయవాడకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది.సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉన్న నగరాలలో భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని భూ పలకాలలో కదలిక ఏర్పడినప్పుడు,మార్పులు జరిగినప్పుడు భూకంపాలు,సునామీలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది.

భూకంపాలు వచ్చే నగరాలపై అధ్యయనం చేసిన నిపుణులు
ఇక భూకంప ప్రమాదాల గురించి,ఏయే నగరాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. సముద్రతీర ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు?సముద్రతీర ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరిగింది?వాటి పరిస్థితి ఎలా ఉంది?ఇక నిర్మాణాలు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి?అక్కడ భూకంపం వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా?గతంలో ఎప్పుడైనా భూకంపాలు వచ్చాయా? వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని పరిశోధన చేశాయి.

దేశ వ్యాప్తంగా 50 నగరాలకు భూకంప సూచన
సుమారు మూడేళ్ల పాటు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ తన విద్యార్థులతో కలిసి ఈ రిపోర్టును సిద్ధం చేశారు.ఆ రిపోర్ట్‌ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రం మళ్లీ పరిశీలించాయి.చివరికి 50 నగరాలకు భూకంపం ప్రభావం ఉందని రిపోర్టు సిద్ధం చేశాయి.దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 50 నగరాలకు భూకంప ప్రభావం ఉందని రిపోర్టులో వెల్లడైంది.వాటిలో 13 నగరాల్లో తీవ్రమైన భూకంపాలు రానున్నట్లు రిపోర్టులో తేల్చేసింది.

బెజవాడలో భూకంప తీవ్రత అధికమేనని రిపోర్ట్
30 నగరాల్లో రిక్టర్ స్కేలుపై 4 నుంచీ 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది.ఇక 7 నగరాల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు రానున్నాయి.అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడ కూడా ఉండడంతో ప్రస్తుతం ఇది ఏపీలో విజయవాడ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇక విజయవాడతో పాటుగా ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, ఛండీగఢ్ వంటి నగరాలలోనూ అధికంగా భూకంపాలు వస్తాయని రిపోర్టులో తేలింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎప్పుడుఎలాంటి చిన్న భూ కదలిక అనిపించినప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications