Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింహంతో ఆట జగనన్నతో వేట మంచిది కాదు: బాక్సులు బద్దలు కొడతానన్న మంత్రి రోజా

ఏపీ మంత్రి రోజా సెల్వమణి వైసీపీ ప్లీనరీలో ప్రతిపక్ష పార్టీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్ల అని చూడకుండా విష ప్రచారం చేస్తున్నారంటూ మండి పడిన రోజా ఒక్కొక్కరికి బాక్స్ లు బద్దలు కొడతాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 12 సంవత్సరాలుగా ఎన్నో కుట్రలు చేశారని, అయినప్పటికీ వాటిని ఎదిరించి నిలబడిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా కొనియాడారు. సూటిగా చెప్తున్నా .. సింహంతో ఆట జగన్ అన్నతో వేట అయ్యే పని కాదని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన వైయస్సార్ ప్లీనరీ సమావేశంలో మంత్రి రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 జగన్ అంటేనే బ్రాండ్ .. సంక్షేమ పథకాల సామ్రాట్

జగన్ అంటేనే బ్రాండ్ .. సంక్షేమ పథకాల సామ్రాట్


ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా వెన్ను చూపకుండా మొక్కవోని ధైర్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు. జగన్ అంటేనే ఒక బ్రాండ్ అని రోజా పేర్కొన్నారు. వైయస్సార్ చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు చిదిమి వెయ్యాలని చూశారని, కానీ వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ముందుకు నడిచారు అని రోజా పేర్కొన్నారు. సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ అని మంత్రి రోజా కొనియాడారు. సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సీఎం జగన్ అందించారని పేర్కొన్నారు.

బీజేపీ నేతల కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవటానికి చంద్రబాబు పరుగులు

బీజేపీ నేతల కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవటానికి చంద్రబాబు పరుగులు


దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ, ప్రధానితో సహా ప్రశంసలందుకున్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని రోజా పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగలేదని రోజా మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇచ్చారా అంటూ రోజా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చర్చించే దమ్ముందా అంటూ రోజా సవాల్ విసిరారు. జగన్ ను ఎదుర్కొనే సత్తా లేకనే చంద్రబాబు నాయుడు బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికి, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నాడు అని రోజా వ్యాఖ్యలు చేశారు.

గుంపులు గుంపులుగా పందుల్లా.. సింహంతో పెట్టుకుంటున్నారు.. వేటాడటం ఖాయం

గుంపులు గుంపులుగా పందుల్లా.. సింహంతో పెట్టుకుంటున్నారు.. వేటాడటం ఖాయం


గుంపులు గుంపులుగా పందుల మాదిరిగా కుట్రలు చేస్తున్నారని, కానీ వాళ్లు పెట్టుకుంటుంది సింహంతో నని, అందర్నీ వేటాడటం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుందని పేర్కొన్న రోజా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి నగదు కు లెక్క ఉందని, గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతాయని రోజా పేర్కొన్నారు. దేశ ప్రధాని కూడా అప్పులు చేస్తారంటూ రోజా వెల్లడించారు. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు.

 తన మౌనం చేతగానితనం కాదు .. బాక్సులు బద్దలు కొడతా

తన మౌనం చేతగానితనం కాదు .. బాక్సులు బద్దలు కొడతా


అమ్మఒడిలో కోతలు పెట్టారని అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి అందించామని రోజా పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని రోజా స్పష్టం చేశారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. కొంతమంది గ్రామ సింహాలు, ప్రతిపక్షాలు ఆడపిల్ల అని కూడా చూడకుండా విష ప్రచారం చేస్తున్నారంటూ రోజా పేర్కొన్నారు. తన మౌనం చేతకానితనం కాదని పేర్కొన్న రోజా ఒక్కొక్కరి బాక్స్ లు బద్దలు కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+