పబ్‌లో అర్థరాత్రి ఏపీ ఐఏఎస్ రచ్చ.. కుప్పం స్పెషల్ ఆఫీసర్ పై కేసు

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అర్థరాత్రి పబ్‌లపై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. పబ్బులు, బార్లలో సాగుతున్న అక్రమ కార్యకలాపాలు, మైనర్లకు మద్యం విక్రయాలపై కఠిన చర్యలకు దిగిన పోలీసు అధికారులతో కొందరు వ్యక్తులు బాహాబాహీకి దిగడం కలకలం రేపింది.

పోలీసుల విధుల నిర్వహణను అడ్డుకోవడమే కాకుండా, వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనలో ఏపీకి చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కుప్పం ప్రాంతాభివృద్ధి సంస్థ (KADA) ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Bengaluru Police Register FIR Against AP IAS Officer Vikas Marmat and Three Others for Pub Altercation

అర్ధరాత్రి దాడులు.. పబ్‌లో అసభ్య ప్రవర్తన!

నగర పోలీసు కమిషనర్ జారీ చేసిన ఆదేశాల మేరకు అక్టోబర్ 9 అర్ధరాత్రి దాటిన తర్వాత కబ్బన్ పార్క్, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్బులు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. ఇన్స్‌పెక్టర్ అరుణ్ సాలుంకే నాయకత్వంలో ప్రత్యేక పోలీసు బలగాలు రెసిడెన్సీ రోడ్డులోని 'కావోర్ బార్ అండ్ రెస్టారెంట్'కు చేరుకుని కస్టమర్ల ఐడెంటిటీ కార్డులు పరిశీలిస్తుండగా ఈ రచ్చ మొదలైంది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ ఆయన సహచరులతో కలిసి చిన్న విషయానికే పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనిఖీలను అడ్డుకుంటూ అధికారులను దారుణంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

నెట్టింట వైరలైన వీడియోలు.. ఏ క్షణమైనా అరెస్ట్?

ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై ఇన్స్‌పెక్టర్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ అనే మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) పరిధిలోని సెక్షన్ 115(2), 351(2), 352, 132, 133 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ప్రైమ్ ఏక్యూజ్డ్ (A1)గా చేర్చడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+