నాకేం సంబంధం లేదు: హెబెట్టు మంజు, సూరి అనుచరుడు కాడు: గంగుల భానుమతి
హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడు మధుసూదన్ రెడ్డి అలియాస్ మధుమోన్ రెడ్డిపై దాడితో తనకు ఏ విధమైన సంబంధం లేదని హెబెట్టు మంజునాథ్ స్పష్టం చేశారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు.
తనను బద్నాం చేయడానికి ఆ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనకు గానీ తన పిల్లలకు గానీ మధుమోహన్ రెడ్డిపై దాడితో సంబంధం లేదని ఆన అన్నారు. తాను గత ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు.
రియల్ ఎస్టేట్ సంబంధాలున్న గ్యాంగులు బెంగళూరులో వందకు పైగా ఉన్నాయని ఆయన చెప్పారు. తనకు దుబాయ్‌లో హోటల్ ఉందని, అటువంటి పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

చేసిన పాపం ఊరికే పోదని మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి మధుమోహన్ రెడ్డిపై జరిగిన దాడి సంఘటనపై అన్నారు. మధుమోహన్ రెడ్డి సూరి అనుచరుడు కాడని ఆమె అన్నారు చిన్నవ్యాపారాలు చేసుకునే మధు భూదందాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నాడని ఆమె అన్నారు.
మధుమోహన్ రెడ్డితో తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదని భానుమతి అన్నారు. సూరి పేరు చెప్పుకుని మధుమోహన్ రెడ్డి భుదందాలు చేస్తున్నాడని ఆమె అన్నారు. మధుమోహన్ రెడ్డికి తగిన శిక్ష పడాలని భానుమతి అన్నారు.












Click it and Unblock the Notifications