మరో మహమ్మారి పొంచి ఉంది - బీ అలర్ట్ : భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల..!!

కరోనా మహమ్మారి చేసిన విధ్వసం మర్చిపోకముందే మరో ముప్పు పైన హెచ్చరికలు వస్తున్నాయి. భవిష్యత్తులో మరో మహమ్మారి పొంచి ఉందని‌ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. కరోనా వేళ భారత్ బయోటెక్ కో వాగ్జిన్ వాక్సిన్ ను ఉత్పత్తి చేసి..మహమ్మారి నియంత్రణలో కీలక భూమిక పోషించింది. కొవిడ్-19 నేపథ్యంలో.. ఈసారి జంతుజాలం నుంచి విపత్తు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ - 2022లో ఈ మేరకు మందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే మహమ్మారులు.. విపత్తుల ప్రమాదాలను హెచ్చరిస్తూ ప్రకృతి సందేశాలు ఇస్తుందని వివరించారు. కానీ, వాటిని అర్థం చేసుకుని అప్రమత్తం కాకుండా నిర్లక్ష్యం వహిస్తుండటం వల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మరింత కీలక సమాచారం వెల్లడించారు. భవిష్యత్తులో మహమ్మారి జంతువుల్లో వచ్చే అవకాశం ఉందనేది తన అంచనాగా డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు. గతంలో స్వైన్‌ ఫీవర్‌, బర్డ్‌ఫ్లూ వంటి ద్వారా ప్రకృతి మనకు సంకేతాలు ఇచ్చిందని గుర్తు చేసారు.

Bharat Biotech Executive Chairman Krishna Ella Alerts on Another pandamic in future

కొవిడ్‌ మహమ్మారికి ముందు 2019 డిసెంబరు 5న బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో తాను ప్రసంగించని విషయాన్ని ప్రస్తావించారు. కొవిడ్‌ వెలుగులోకి వచ్చే మూడు నెలల ముందుగానే.. ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు ఇచ్చిందన్నారు. సార్స్‌ కోవ్‌, ఎబోలా వంటి సంకేతాలు వచ్చాయని వివరించారు. కానీ వాటిని మనం పట్టించుకోలేదన్నారు. జంతువుల్లో ఆఫ్రికన్ స్వైన్‌ ఫీవర్‌, లంపీ స్కిన్‌ వంటి ద్వారా మరోసారి మనకు సంకేతాలు అందుతున్నాయని అప్రమత్తం చేసారు. మరో ముప్పు పొంచి ఉందని ప్రకృతి హెచ్చరిస్తోందని విశ్లేషించారు. ఆ ముప్పు ఎలా వస్తుందో మనకు తెలియదనని చెప్పారు. ఆ మహమ్మారి ప్రభావం మనుషులపైనే కాకుండ మొత్తం జీవనాధారాలను దెబ్బతీస్తుందని డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+