భోళాశంకర్ కొంప ముంచిన చిరంజీవి?

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం భోళాశంకర్. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య కన్నా భారీ డిజాస్టర్ అని అభిమానులే స్పష్టం చేస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లంతా నష్టపోయారు. వాస్తవానికి ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకరకు దీనికన్నా ముందు ఏజెంట్ తో ఒక డిజాస్టర్ పడింది. తాజాగా రెండు డిజాస్టర్లవడంతో డిస్ట్రిబ్యూటర్లంతా కేవలం అడ్వాన్స్ తోటే సరిపెట్టేశారు.

సినిమాలో విషయం ఉన్నా లేకపోయినా.. ప్రధానంగా భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయింది.. బాగోలేదు అన్న ప్రచారమే బాగా జరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడి పనితీరు కూడా ఉందని, వీటికితోడు చిరంజీవి చేసిన రెండు తప్పిదాలు కూడా ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం రావడనానికి కారణమంటున్నారు.

bhola shankar movie flop behind the reason chiru comments

మొదటిది.. చిరంజీవి పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమంటున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లాంటి విషయాలపై దృష్టిపెట్టకుండా పిచుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమ మీద పడతారేంటంటూ చేసిన వ్యాఖ్యలు సినిమాకు నష్టం చేకూర్చాయంటున్నారు. దీనివల్ల వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో సినిమా బాగోలేదు అని చేసిన ప్రచారమే ప్రజల్లోకి వెళ్లిపోయిందంటున్నారు.
వైసీపీకి జనసేన రాజకీయ ప్రత్యర్థి కావడం, జనసేనాని పవన్ కల్యాణ్ చిరంజీవికి తమ్ముడు కావడంతో చిరును టార్గెట్ చేశారు.

రెండోది.. చిరంజీవి చేసిన మరో కామెంట్.. అప్పట్లో నేను... అంటూ బాలయ్యలా దీర్ఘం తీసి మాట్లాడారు. దీంతో అప్పట్లో నేను అంటే.. ఇప్పట్లో నువ్వేం కావు.. అంటూ భోళాశంకర్ సినిమా దరిద్రంగా ఉందంటూ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ.. రెండూ దాడిచేయడంతోపాటు బాలయ్య అభిమానులు వైసీపీ ప్రచారంలో వాడిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వచ్చింది. చివరకు అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది ఈ సినిమా నిర్మాతే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+