జగన్‌పై అఖిల ప్రియ తీవ్ర ఆగ్రహం, 'మేం తలుచుకుంటే.. రోజా మాట్లాడరేం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. వైసీపీ జెండాలు పట్టుకుని, తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారన్నారు.
దానిని వైసీపీ నేతలు ఖండించాల్సిందిపోయి అసలు గొడవే జరగలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మహిళల పట్ల జగన్‌కు గౌరవం లేదా, దాడులను జగన్ ప్రోత్సహిస్తున్నారా? అని నిలదీశారు.
వీడియో ఫుటేజీపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను రాజకీయం చేయాలనుకుంటే, విజయవాడలోనే ఉండి గొడవ చేసే దానిని అని అన్నారు.

తలుచుకుంటే సభలు జరగవు: జూపూడి
ప్రభుత్వం తలుచుకుంటే వైసీపీ సభలు, యాత్రలు చేయలేదని, వాళ్లలా దిగజారుడు రాజకీయాలు తాము చేయలేమని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. వైసీపీ కార్యకర్తలు తన కారును కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారన్నారు.
మహిళా ఎమ్మెల్యే అఖిల ప్రియపై దాడికి పాల్పడితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నటి రోజా ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. నిన్నటి ఘటనపై జగన్ ఇప్పటి దాకా క్షమాపణ చెప్పలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications