నంద్యాల బరిలో బ్రహ్మానంద రెడ్డి: అందుకే బాబు నిర్ణయం, అఖిల హ్యాపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ సీటు కోసం టిడిపి నుంచి అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌ రెడ్డిని బ‌రిలోకి దింపాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్ణయించారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లో సీటు కోసం టిడిపి నేత‌ల్లో పెద్ద పోరు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Bhuma Brahmananda Reddy will contest from Nandyal

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానం కాబట్టి నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ సీటు కోసం టిడిపి నుంచి అభ్య‌ర్థిగా భూమా కుటుంబంలోని వారినే బరిలోకి దించుతున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

అఖిలప్రియ వెనుక రాజకీయ కుట్ర!?: ఎదుగుదలను ఓర్వలేకే!.. దెబ్బకొట్టడానికేనా!

క‌ర్నూలు జిల్లా టడిపి నేత‌లంద‌రినీ పిలిచి, అభిప్రాయం తీసుకున్నాకే చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆ టికెట్ భూమా కుటుంబానికే ఇవ్వాల‌ని పార్టీలో మొద‌టి నుంచే ఉంద‌న్నారు.

ఒక‌వేళ ఆ కుటుంబంలోని వ్య‌క్తికి టికెట్ ఇవ్వ‌క‌పోతే త‌మ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు టిడిపి నేత‌లు డిమాండ్ చేశార‌ని తెలిపారు. చివ‌ర‌కు భూమా కుటుంబంలోని వారికే టికెట్ ఇవ్వాల‌ని అంద‌రూ క‌లిసి స‌మష్టిగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని కాల్వ తెలిపారు. కాగా, మొదటి నుంచి తమ కుటుంబ సభ్యులకే టిక్కెట్ కోరుతున్న అఖిలప్రియకు ఇది సంతోషకరమైన విషయం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Akhila Priya's brother Bhuma Brahmananda Reddy will contest from Nandyal.
Please Wait while comments are loading...