రాజ్యసభ సీటు మిస్ పై స్పందించిన షర్మిల..! మీ ఫ్రస్టేషన్ ఏంటి ?
కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు అధిష్టానం ఇచ్చిన రాజ్యసభ సీటు హామీ నిలబెట్టుకోవాలంటూ ఈ మధ్యే పార్టీ పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేసిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)కు ఎంపికలో మాత్రం నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి తప్పకుండా తనకు సీటు లభిస్తుందని ఆశించిన షర్మిల సైలెంట్ గా ఉంటున్నారు. అయితే దీనిపై బీజేపీ సెటైర్లు వేస్తూ పెట్టిన ట్వీట్ ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో బీజేపీకి షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు.
షర్మిలకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై ఏపీ బీజేపీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో రాజ్యసభ సీటు రాకపోవడంతో ఏర్పడిన అసహనంలో షర్మిల ట్వీట్ చేస్తూ వాస్తవాలను పూర్తిగా విస్మరించినట్టున్నారు అంటూ ప్రధాని మోడీపై ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. దీనిపై స్పందించిన షర్మిల.. రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం అంటూ వైఎస్ షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. మధ్యలో మీ అసహనం ఏంటి ? ఈ అతి స్పందన ఎందుకు ? అంటూ బీజేపీకి చురకలు అంటించారు.

రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం. మధ్యలో మీ అసహనం ఏంటి ? ఈ అతి స్పందన ఎందుకు ? 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక, అర్థం పర్ధం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైంది.
— YS Sharmila (@realyssharmila) June 11, 2026
ప్రజా ఉద్యమ గొంతుకగా… https://t.co/0XXqsfxbA1
12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక, అర్థం పర్ధం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైందన్నారు. ప్రజా ఉద్యమ గొంతుకగా ఎవరిది ఆరాటమో, ఎవరిది అసహనమో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంకితభావం మాది. సహనాన్ని కోల్పోయి పిచ్చిప్రేలాపనలు మీవి అన్నారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పుండుమీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తిన 12 వైఫల్యాల మీద సమాధానం చెప్పాలన్నారు. మీద మెరుగులు చూపించడం ఆపి లోపల పురుగుల సంగతి తేల్చాలన్నారు. రైళ్లు, రహదారులు అని చెప్పడం కాదని, నిత్యావసర ధరలు 300 శాతం ఎందుకు పెరిగాయో చర్చకు రావాలన్నారు.














Click it and Unblock the Notifications