వైఎస్‌పై టిడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది: భూమన
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై అభాండాలు వేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం తిరుపతిలో ఆ మహానేత 5వ వర్దంతి వేడుకలు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికీ అందడం లేదని ఆ వేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ చనిపోయిన అనంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం, అభ్యున్నతి కోసం, విద్యార్దుల భవిష్యత్తు కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించేవారని అన్నారు. అందుకే ఈరోజు వాడవాడలా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఊరురా ప్రతిష్టించారు. ఆయన విగ్రహాలకు ప్రజలు పూజలు చేసి నివాళులు అర్పిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వద్ద మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా వైయస్ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు వైయస్ భారతి, కూతురు షర్మిల ఇతర కటుంబ సభ్యులతో నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications