బూచాడిలా భయపెడుతున్నాడు, రోజులు దగ్గరే: చంద్రబాబుపై భూమన ఫైర్
హైదరాబాద్: టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు తొంగలో తొక్కారని ఆరోపించారు. అన్నివర్గాలను మోసం చేసి మాయల మరాఠిలనే చంద్రబాబు మించి పోయారని అన్నారు.
చంద్రబాబును చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును మోసాలను ప్రజల మధ్యకు వెళ్లి ఎండగడతామన్నారు. ప్రజావ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదని అన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు తీర్చలేదని ఆరోపించారు. సీఎం అయ్యాక చేసిన ఐదు సంతకాల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. చంద్రబాబు ఊక దంపుడు ఉపన్యానాలు వినలేక జనం జంకుతున్నారని అన్నారు. బుచాణ్ని చూస్తే ఎలా భయపడతారో అలాంటి పరిస్థితి వచ్చిందని చంద్రబాబునుద్దేశించి అన్నారు.
దోపిడీ చేయడంలో బాబుకు ఎవరూ సాటిరారని అన్నారు. జులై 8న నుంచి గడప గడపకు వైయస్సార్ సీపీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుతున్నామని చెప్పారు. చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజల్లో ఎండగడతామని అన్నారు. ప్రజల పట్ల చులకన భావంతో చంద్రబాబు వంచన కౌశలం వంద రెట్లు పెరిగిందన్నారు. చంద్రబాబుది ప్రజాకంటక పాలన అని మండిపడ్డారు.
బీసీల్లో చేరుస్తామని కాపులను వంచిండడం లోకమంతా చూసిందని అన్నారు. ముద్రగడ కుటుంబం పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అమానుషమని అన్నారు. ప్రజావ్యతిరేక పాలన ఎంతో కాలం కొనసాగదని, చంద్రబాబుపై ప్రజలు తిరబడేరోజు దగ్గరలోనే ఉందని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications