చంద్రబాబు అబద్దాలపై ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ నిధులను సంక్షేమ పథకాలకు మళ్ళించలేమని చెప్పిన సీఎం చంద్రబాబు మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో పవన్ ను టార్గెట్ చేసిన భూమన
అయితే చంద్రబాబు వ్యాఖ్యల పైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అబద్దాల మాటల పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు అబద్దాలు చెప్పినందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ గుడి మెట్లు కడుగుతారో చెప్పాలంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఇస్తామని సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. చంద్రబాబు మరోమారు ప్రజలను వెన్నుపోటు పొడిచారని, నీతి ఆయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనని మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
మళ్ళీ కొత్త అబద్దాలకు తెరతీసిన చంద్రబాబు
గత ఎన్నికల ప్రచార సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా వైయస్ జగన్ కంటే అన్ని తాము ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసారని భువన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త అబద్దాలకు తెరతీసారని మండిపడ్డారు.
అబద్దాల బుద్ధుడు చంద్రబాబు
అబద్ధాల బుద్ధుడు ఈ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఘోరమైన పరిపాలన చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిందని, అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పుభవ అయిందని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న ఏరుదాటాక బోడి మల్లన్న అన్నట్టు చంద్రబాబు తీరు ఉందని రాష్ట్ర ప్రజలకు ఆయన తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు.
బాబు హయాంలో ఏపీ మద్యాంధ్ర ప్రదేశ్ గా మారింది
ఇక చంద్రబాబు అబద్దాల మాటల పైన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన అన్ని హామీలను 98% అమలు చేస్తే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేశాడని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో రాష్ట్రం మధ్యాంధ్ర ప్రదేశ్ గా మారిందని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications