పైసాకు ఉపయోగపడని మంత్రులు: చంద్రబాబుకు భూమన హెచ్చరిక

ఏపీ కేబినెట్లో జగన్ తీరును ఖండిస్తూ తీర్మానం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడే ఓ మానసిక రోగి అని వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

విజయవాడ: ఏపీ కేబినెట్లో జగన్ తీరును ఖండిస్తూ తీర్మానం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడే ఓ మానసిక రోగి అని వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

తమ నాయకుడి పైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పైసాకు కూడా ఉపయోగపడని మంత్రుల మాటలకు భయపడేది లేదని చెప్పారు. జగన్‌ను చూస్తే చంద్రబాబు అండ్ కోకు అంత భయం ఎందుకని నిలదీశారు.

bhumana karunakar reddy

దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో నిజాలు నిగ్గు తేల్చడానికే జగన్ నందిగామ వెళ్లారని చెప్పారు. అయితే పక్కన ఉన్న చంద్రబాబు మాత్రం బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని మండిపడ్డారు.

గతంలో అధికారుల గురించి నీచంగా మాట్లాడింది చంద్రబాబే అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించింది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబు తిడితే వాదాక్షరాలు, జగన్ చట్టం గురించి మాట్లాడితే బూతులు అవుతాయా అన్నారు.

వరల్డ్ బ్యాంకుకు తొత్తుగా చంద్రబాబు మనసులో మాట పుస్తకం రాశారని ఆరోపించారు. ఆ పుస్తకంలో విద్యుత్ రంగంలో 60 శాతం, రెవెన్యూ రంగంలో 64 శాతం, పోలీస్ శాఖలో 62 శాతం మంది ఉద్యోగులు అవినీతిపరులు అని, ఉద్యోగులకు జీతాలు దండుగ అని రాసుకున్నారని చెప్పారు.

అసెంబ్లీలో ప్రజల వాయిస్ అయిన ప్రతిపక్షం గొంతు వినాలని హితవు పలికారు. సభలో బెంచీలు, కుర్చీలతో ప్రయోజనం లేదన్నారు. సభను ఉన్నత ప్రమాణాలతో నడపాలన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పాలనలో స్వచ్ఛత ఉండేలా చూసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+