వివాహేతర సంబంధం: అడ్డుగా ఉన్నాడని కొడుకుకు చిత్రహింసలు, అమ్మమ్మ ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా కన్నకొడుకును చిత్రహింసలకు గురిచేస్తోంది ఓ తల్లి.అయితే కూతురు తన మనమడిని పెట్టే చిత్రహింసలకు గురిచేయడాన్ని నిరసిస్తూ బాధితుడితో కలిసి ఆమె ఫిర్యాదు చేసింది.

నెల్లూరు జిల్లా వేదాయపాలెనికి చెందిన కల్లూరి శాస్త్రి, రమణమ్మ దంపతులకు వరలక్ష్మి, ప్రసాద్ అనే ఇద్దరు సంతానం.వారు కూలీ పనులు చేసుకొంటూ జీనం సాగిస్తున్నారు.

15 ఏళ్ళ క్రితం వరలక్ష్మిని పొదలకూరు మండలం టైలర్స్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి రెండో పెళ్ళి చేశారు.మొదటి భార్యకు పిల్లలు కాకపోవడంతో ఆయన వరలక్ష్మిని రెండో భార్యగా చేసుకొన్నాడు.

bhupesh babu harassed by mother in nellore district.

ఈ దంపతులకు భూపేష్ పుట్టాడు.అయితే కొడుకు పుట్టిన తర్వాత భార్య, భర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ విబేధాల కారణంగా వెంకటేశ్వర్లు, వరలక్ష్మి విడిపోయారు.అయితే ఈ సందర్భంగా వరలక్ష్మికి పుట్టిన కొడుకుకు వెంకటేశ్వర్లు ఇళ్ళు రాసిచ్చాడు.

భర్త వెంకటేశ్వర్లుతో విడిపోయిన వరలక్ష్మి నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అనంతరం పొదలకూరుకు చెందిన ఓ వ్యాపారితో కూడ ఆమె సహజీవనం చేస్తూ ఓ కూతురకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలోనే భూపేష్ ను చిత్రహింసలకు గురిచేసేది వరలక్ష్మి.భూపేష్ కు తండ్రి వెంకటేశ్వర్లు రాసిచ్చిన ఇంటిని కూడ వరలక్ష్మి కూడ అమ్మేసింది.

వాతలు పెట్టడం, సూదులతో గుచ్చడం తీవ్రంగా కొట్టడం వంటివి చేసేది వరలక్ష్మి.ఈ విషయమై వరలక్ష్మి తల్లి రమణమ్మకు ఇరుగుపొరుగువారు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె పొదలకూరు వెళ్ళి మనమడిని తనతో పంపాలని కోరింది.దీంతో వరలక్ష్మితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడ రమణమ్మపై దాడి చేశారు.

దీంతో రమణమ్మ అడిషనల్ ఎస్పీ శరత్ బాబును కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bhupesh babu harassed by mother in nellore district. varalaxmi, mother of bhupesh babu harassed him for one year. varalaxmi living together a business man, so varalaxmi harassed him.
Please Wait while comments are loading...