ఆ ధైర్యం చేయలేం: విభజనను బిజెపి ఆపగలదన్న కిల్లి

కేంద్రమంత్రి కిల్లి కృపారాణి బుధవారం విభజన అంశంపై మాట్లాడుతూ... విభజన నిర్ణయం ఆపుతామనే ధైర్యం లేదన్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ తెలంగాణపై దూకుడుగా వెళ్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పే ధైర్యం చేయలేమన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విభజనను బిజెపి మాత్రమే అడ్డుకోగలదన్నారు. బిజెపి తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే తప్ప ఆగే ప్రసక్తి లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పైన తాము ఆశలు పెట్టుకున్నట్లుగా చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బుధవారం విభజన తీరు పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications