జగన్ పై వీరాభిమానం: 11 ఏళ్ళుగా చెప్పులు వేసుకోకుండా.. సీఎంను కలవాలని ఆరాటం .. ఎందుకంటే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరికి వారు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేలా ఏవో ఒక చర్యలను చేపడుతూనే ఉంటాను. కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి పై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తే, మరికొందరు ఎవరైనా ఒక్క మాట అంటే చాలు వారిపై తిరిగి మాటల దాడి చేస్తుంటారు. అయితే ఓ వీరాభిమాని మాత్రం ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పటినుండి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతేనా జగన్ సీఎం అయ్యే వరకు, ఆయనను తాను కలిసే వరకు చెప్పులు లేకుండా నడుస్తానని ప్రతిన బూనాడు .

కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వీరాభిమానం

కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వీరాభిమానం


ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటా కథ అంటే కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం .. జగన్ కు వీరాభిమాని. 2010లో జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన ఖాసీం జగన్ సంకల్పానికి చలించిపోయాడు . ప్రజల కోసం మండుటెండలని సైతం లెక్క చెయ్యని జగన్ పై ఆయన అభిమానం రెట్టింపు అయ్యింది. వైయస్ఆర్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాక్షించారు.

 ఓదార్పు యాత్ర సమయంలో జగన్ సీఎం కావాలని భీషణ ప్రతిజ్ఞ ..11 ఏళ్ళుగా చెప్పులు లేకుండా

ఓదార్పు యాత్ర సమయంలో జగన్ సీఎం కావాలని భీషణ ప్రతిజ్ఞ ..11 ఏళ్ళుగా చెప్పులు లేకుండా

ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని కలిసేంతవరకూ తాను చెప్పులు ధరించనని గ్రామస్తులు అందరి సమక్షంలో శపధం చేశాడు. ఇక శపథానికి కట్టుబడి 11 సంవత్సరాలుగా పాదరక్షలు లేకుండానే నడక సాగిస్తున్నాడు. ఎర్రటి ఎండలోనూ, రోడ్లు అట్లపెనంలా కాలుతున్నా జగనన్న కోసం చెప్పులు లేకుండా నడవడంలో తనకు ఆనందం ఉందంటున్నాడు ఖాసిం.
సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని ఉందని, తనను ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాలని కోరుతున్నాడు.

జగన్ దగ్గరకు వెళ్ళొచ్చాకే పాదాలకు చెప్పులు , అప్పటివరకు ఎండలైనా డోంట్ కేర్

జగన్ దగ్గరకు వెళ్ళొచ్చాకే పాదాలకు చెప్పులు , అప్పటివరకు ఎండలైనా డోంట్ కేర్

ఇప్పటికే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ని కలిశానని, ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకి తీసుకెళతానని చెప్పారని పేర్కొన్నారు. ఇక ఖాసీం గురించి గ్రామ ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలిసేదాకా ఖాసీం చెప్పులు వేసుకునేలా లేడని , మండుటెండల్లో కాళ్లు కాలుతున్నా సరే అలాగే తిరుగుతున్నాడని చెప్పుకొచ్చారు. ఆయనను త్వరగా సీఎం దగ్గరికి తీసుకెళ్లండి అని గ్రామస్థులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+