Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?

ఏపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎట్టకేలకు చివరి జాబితాలో సీటు దక్కింది. భీమిలి సీటును గంటా దక్కించుకున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఒకప్పటి మంచి మిత్రులు. ఒక విధంగా గురు శిష్యులు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధులుగా ఒకటే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరి భీమిలి కలిసొచ్చేదెవరికి.

నువ్వా - నేనా
విశాఖ జిల్లాలో భీమిలి సీటుకు ప్రత్యేకత ఉంది. 2009 లో ఇద్దరూ ప్రజారాజ్యం నుంచి విశాఖ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. 2009లో భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్, అనకాపల్లి నుంచి గంటా ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. ఆ తరువాత గంటా నాడు కిరణ్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. చిరంజీవితో సత్సంబంధాలు ఉన్న నేత కావటంతో మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తరువాత గంటా, అవంతి ఇద్దరూ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో అయిష్టంగానే అవంతి అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది. భీమిలి స్థానం గంటా తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గంటా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

Big Fight between Ganta and Avanthi in Bhimili constituency Who will win the seat

గురు శిష్యుల పోరు
అప్పటి నుంచే గంటాతో అవంతికి గ్యాప్ మొదలైంది. భీమిలి నుంచి గంటా పోటీ చేసేందుకే తనను ఎంపీగా పంపారనేది అవంతి అభిప్రాయం. ఇక, గంటా టీడీపీలో ఉండగానే..అవంతి వైసీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. తాను కోరుకున్న విధంగా జగన్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. గంటా టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, టీడీపీ వ్యవహారాల్లో అంటీ మట్టనట్లుగానే వ్యవహరించారు. ఒక దశలో గంటా వైసీపీలో వస్తున్నారనే ప్రచారంతో అవంతి అలర్ట్ అయ్యారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి గంటా ససేమిరా అనటంతో చివరి నిమిషంలో గంటాకు భీమిలి సీటు ప్రకటించారు.

గెలుపు దక్కేదెవరికి
భీమిలి నుంచి రెండు సార్లు అవంతి, ఒకసారి గంటా గెలుపొందారు. ఇద్దరూ ఒకటే సామాజిక వర్గం. భీమిలిలో కాపు వర్గంతో పాటుగా యాదవులు, బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సారి జనసేన తో పొత్తు కారణంగా తనకు కలిసి వస్తుందని గంటా అంచనా వేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచి ఉండటంతో అప్పటి నుంచి ఉన్న పరిచయాలు, వైసీపీకి సహజంగా ఉండే ఓట్ బ్యాంక్ తో తనకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది అవంతి అంచనా. ఏరి కోరి తెచ్చుకున్న సీటు కావటంతో ఇక్కడ గెలుపు గంటాకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గంటా పైన విజయం సాధించి తన సత్త చాటాలనేది అవంతి లక్ష్యం. దీంతో..ఈ ఇద్దరి మధ్య భీమిలి కేంద్రంగా సాగే ఎన్నికల యుద్దం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+