Chandrababu Security: చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం -ఇక 12 ప్లస్ 12 కమెండోలు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర నిఘా సంస్ధల హెచ్చరికల నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మరింత పెంచింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకూ ఇస్తున్న కమెండోల సంఖ్యను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Recommended Video
కుప్పంలో వైసీపీ దాడులు, చంద్రబాబు వరుస పర్యటనలు, ఆయనకు ఉన్న ప్రాణహాని ఇలా పలు అంశాల్ని దృష్టిలో ఉంచుకుని భద్రతను సమీక్షించిన కేంద్రం.. నిన్న ఉండవల్లిలోని ఆయన ఇంటితో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ సమీక్ష చేసింది. డీజీఐ నేతృత్వంలోని ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు ఇంటిని, టీడీపీ ఆఫీసును పరిశీలించిన తర్వాత..ఆయనకు కల్పిస్తున్న ఎన్ఎస్జీ కమెండోల భద్రతను 12 ప్లస్ 12కు పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కుప్పంలో చంద్రబాబు వద్దకు అదనపు కమెండోలను పంపారు.

ఇప్పటివరకూ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కింద చంద్రబాబుకు 8 మంది కమెండోలతో భద్రత కల్పిస్తున్నారు. ఈ భద్రతను ఇప్పుడు ఏకంగా 24 మందికి పెంచారు. దీంతో చంద్రబాబు మరింత వెసులుబాటుతో పర్యటనలు చేసేందుకు వీలు కలుగుతుంది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అలిపిరిలో మావోయిస్టులు జరిపిన దాడి తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రబాబుకు అదే భద్రత కొనసాగుతోంది. మధ్యలో వైసీపీ సర్కార్ కానిస్టేబుళ్లను ఉపసంహరించినా తిరిగి హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించింది.












Click it and Unblock the Notifications