ఏపీ ఉద్యోగులకు సర్కార్ బిగ్ రిలీఫ్..! హెల్త్ స్కీమ్,రీయింబర్స్ మెంట్ పై..!
ఏపీలో ఉద్యోగులకు కొత్త ఏడాదిలో ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను కొత్తగా తీసుకొస్తున్న యూనివర్శల్ హెల్త్ స్కీంలో విలీనం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. దీనిపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో ఉద్యోగులకు క్లారిటీ ఇచ్చారు. నిన్న ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఆయన.. వీటిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆరోగ్య పథకం విలీనం విషయంలో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని యూనివర్శల్ హెల్త్ స్కీమ్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ వెనక్కి తగ్గింది. ఈహెచ్ఎస్ ను యూనివర్శల్ హెల్త్ స్కీంలో విలీనం చేయడం లేదని, ప్రత్యేకంగానే కొనసాగిస్తామని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్ ఉద్యోగ సంఘాల నేతల భేటీలో వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు కొత్త ఏడాదిలో ఊరట దక్కినట్లయింది.

అలాగే ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలోనూ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో క్లారిటీ ఇచ్చారు. గతేడాది ఆగస్టు వరకూ ఉన్న ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ బకాయిల్ని క్లియర్ చేశామని, మిగిలిన వాటిని సైతం సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీటిపై వాట్సాప్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ చికిత్సలకు అనుమతి ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపైనా సీఈవో సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే క్యాష్ లెస్ చికిత్సలు అందిస్తున్నామని, వీటిని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications