సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత నంబర్ టూగా ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఓ కేసులో ఆయనకు భారీ ఊరట కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఆయనకు కీలక షరతు కూడా విధించింది. దీంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించినట్లయింది.
వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గత జగన్ సర్కార్ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ ఆయన్ను అరెస్టు చేయకుండా పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో ఈ కేసులో దర్యాప్తుకు పోలీసులకు పూర్తిగా సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తనకు సంబంధం లేదని, ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా తనను పోలీసులు ఏ 120గా కేసులో చేర్చారని సజ్జల తెలిపారు. దీంతో అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయన అరెస్టు కాకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications