జగన్ కు కేంద్రం మరో ఝలక్-సీఐడీ ఛీఫ్ పై చర్యలు-నెగ్గిన రఘురామ పంతం

ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మధ్య వరుసగా జగన్ సర్కార్ పై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్న రఘురామకృష్ణంరాజు అందుకు తగ్గ ఫలితాలను కూడా అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి రఘురామరాజుకు మరో తీపి కబురు అందింది. గతంలో తాను చేసిన ఓ ఫిర్యాదుకు సంబంధించి స్పందించిన కేంద్ర హోంశాఖ ఏపీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు రఘురామ సంతోషంలో మునిగిపోతున్నారు.

 జగన్ వర్సెస్ రఘురామ

జగన్ వర్సెస్ రఘురామ

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గత రెండేళ్లలో చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతో పాటు కీలక అధికారుల నియామకం వరకూ ఆయన ఎన్నో అంశాల్ని టార్గెట్ చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా కేంద్రానికి చేసిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా తనను ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ ప్రయోగించిన అధికారుల్ని సైతం టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆయన పదే పదే ఇరుకునపెడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

 రాజద్రోహం కేసు మోపిన సీఐడీ ఛీఫ్

రాజద్రోహం కేసు మోపిన సీఐడీ ఛీఫ్

జగన్ సర్కార్ ఆదేశాల మేరకు సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై రాజద్రోహం కేసు మోపారు. బెయిల్ కు వీల్లేని కేసుల్లో ఒకటైన రాజద్రోహం కేసులో రఘురామను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేయడమే కాకుండా ఆయన్ను కస్టడీలోకి తీసుకుని చేయిచేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని రఘురామ స్వయంగా సుప్రీంకోర్టుకే ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కస్టడీలో రఘురామపై సీఐడీ అధికారులు దాడి చేసినట్లు నిర్ధారించింది కూడా. దీంతో రఘురామ తనపై కస్టడీలో దాడి చేయించిన సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పై రగిలి పోతున్నారు.

 రఘురామకు దొరికిన సీఐడీ ఛీఫ్

రఘురామకు దొరికిన సీఐడీ ఛీఫ్

ఏపీ సీఐడీ ఛీఫ్ గా సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్న పీవీ సునీల్ కుమార్ ను ఎలా టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తున్న రఘురామకృష్ణంరాజుకు రెండు విషయాలు దొరికాయి. ఇందులో ఒకటి గతంలో పీవీ సునీల్ కుమార్ పై నమోదైన వరకట్నం కేసు కాగా.. మరొకటి ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన విద్వేష వ్యాఖ్యల వ్యవహారం. దీంతో ఈ రెండు అంశాల్ని ఐపీఎస్ గా ఉన్న సునీల్ కుమార్ ను టార్గెట్ చేసేందుకు రఘురామరాజు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో అఖిల భారత సర్వీసు అధికారి అయిన సునీల్ కుమార్ పై కేంద్ర హోంశాఖకే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రెండు కేసుల్లోనూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

 సునీల్ పై వరకట్న వేధింపుల కేసు

సునీల్ పై వరకట్న వేధింపుల కేసు

పీవీ సునీల్ కుమార్ పై ఏపీ ఉమ్మ డి రాష్ట్రంలో ఉండగా ఆయన భార్య పి. అరుణ వరకట్న వేధింపుల కేసు పెట్టారు. దీంతో అప్పటి అధికారులు ఆయనపై వరకట్న వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో తాను అరెస్టు కాకుండా కోర్టుకు వెళ్లి సునీల్ కుమార్ మినహాయింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన ఏపీ సీఐడీ ఛీఫ్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. దీంతో వరకట్న వేధింపుల కేసు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ కు సీఐడీ ఛీఫ్ వంటి కీలక పదవి ఎలా అప్పగిస్తారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన రఘురామ.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు.

 సునీల్ పై చర్యలకు కేంద్రం ఆదేశం

సునీల్ పై చర్యలకు కేంద్రం ఆదేశం

ఏపీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పై రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం ఏపీలో జగన్ సర్కార్ కు లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్.. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఈ మేరకు పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది. సునీల్ కుమార్ పై నమోదైన వరకట్న కేసుల్లో ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో హోంశాఖ కార్యదర్శి కోరారు. అయితే రఘురామ కోరిన విధంగా వేధింపుల కేసు ఎదుర్కొంటున్న సునీల్ ను సీఐడీ ఛీఫ్ పదవి నుంచి తప్పిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
     రఘురామకు మరో విజయం

    రఘురామకు మరో విజయం

    ఇప్పటికే జగన్ సర్కార్ తో సాగిస్తున్న పోరులో కేంద్రం వద్ద లాబీయింగ్ తో పలు అంశాల్లో విజయం సాధించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు కీలకమైన సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ విషయంలోనూ కేంద్రం నుంచి ఆదేశాలు ఇప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో జగన్ సర్కార్ తో పోలిస్తే రఘురామరాజు లాబీయింగ్ ఫలిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఇప్పటికే రఘురామరాజుపై అనర్హత వేటు వేయించడంలో విఫలమవుతున్న వైసీపీకి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా సునీల్ పై కేసులు ఉన్నాయని తెలిసీ కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కూ ఇది షాక్ గా మారబోతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+