మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠం భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న పెద్దిరెడ్డి అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ కేవీ. విశ్వనాథన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ ‌సింగ్‌ల ధర్మాసనం ఈ అంశంపై నేడు విచారణ జరిపి తీర్పు వెల్లడించింది.

కాగా పెద్దిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. ధర్మాసనం తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. "ఈ అంశం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్ల అక్కడే తేల్చుకోవాలి," అంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం రెండు వారాలపాటు యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఆదేశాల తర్వాత కేసు మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకుని తుది తీర్పు ఇవ్వవచ్చని తెలిపింది.

big-shock-for-former-minister-peddi-reddy-in-supreme-court

దాంతో ఇప్పుడు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం కీలకం కానుంది. ఈ పరిణామంతో బుగ్గమఠం భూముల వివాదం న్యాయపరంగా కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. రెండు వారాల యథాతథ స్థితి నేపథ్యంలో.. ఈ వ్యవహారం హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా కీలకమైన ఈ కేసులో పెద్దిరెడ్డికి ఊరట దక్కకపోవడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+