Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ షాక్.. ఆ పని చెయ్యకుంటే మీ కార్డు క్యాన్సిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. రేషన్ కార్డులు ఉండి రేషన్ తీసుకునే రేషన్ కార్డుదారులు మీ కార్డులు రద్దు కాకుండా ఉండాలి అంటే ఒక పని కచ్చితంగా చేయాలని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డు దారులు నిర్లక్ష్యం చేస్తే రేషన్ కార్డులు రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోని లబ్దిదారులు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీలో అక్రమాలను నిరోధించడం కోసం ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల ద్వారా ఈ కార్డులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా చాలామంది లబ్ధిదారులు కార్డులను తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డులు అన్ని రేషన్ షాప్ డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీంతో కొంతకాలం చూసిన తర్వాత రేషన్ షాప్ డీలర్లు ఆ కార్డులను తిరిగి తహసిల్దార్ కార్యాలయాలకు పంపిస్తున్నారు.

Big shock for smart ration card holders in AP If you don t do that your card will be canceled

Take a Poll

ఈకేవైసి తప్పనిసరి.. లేదంటే రేషన్ కట్
ఆ తర్వాత ఎవరైనా కార్డులు తీసుకోవాలనుకుంటే తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి కార్డులను తీసుకోవలసి వస్తుంది. అలా కార్డులను తీసుకోనివారు, రేషన్ కార్డులను ఈకేవైసీ చేసుకోనివారు భవిష్యత్తులో రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న క్రమంలో ఈ కేవైసీ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు అని అనర్హులను తొలగించవచ్చని అధికారులు చెబుతున్నారు.

చాలా జిల్లాలలో ఈకేవైసీ చేయించుకోని కార్డుదారులు
ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకుంటారో వారికి రేషన్ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు . రేషన్ డీలర్ వద్ద ఈ పోస్ యంత్రంలో ఒకసారి వేలిముద్ర వేస్తే ఈ కేవైసీ పూర్తవుతుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయినప్పటికీ చాలా జిల్లాలలో ఈ కేవైసీ పూర్తి చేయకుండా చాలామంది ఉన్నారని ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయరో వారు ఆరు నెలల తర్వాత రేషన్ కోల్పోతారని చెబుతున్నారు.

సర్వే చేస్తున్న ప్రభుత్వం
ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఇప్పటికైనా తక్షణం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈకేవైసీ చేయించుకోని కార్డులను ప్రభుత్వం సర్వే చేస్తోంది. మీరు ఈ కేవైసీ చేయించుకోకపోవడానికి కారణం వీరేమైనా అనర్హులా లేదా వలస వెళ్లారా, మరణించారా అన్న అంశాల పైన ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది.

అనర్హుల కార్డులు ఏరివేత, ఈకేవైసీ లేకున్నా కష్టమే
ఈ సర్వే పూర్తయిన తర్వాత అనర్హులను గుర్తించి కార్డులు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తంగా స్మార్ట్ కార్డులు తీసుకోని వారు, ఈ కేవైసీ చేయించుకోనివారు ముందు ముందు రేషన్ కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+