సీజ్ ది షిప్, బిగ్ ట్విస్ట్- పవన్ వాట్ నెక్స్ట్..!!

సీజ్ ది షిప్. ఏపీ రాజకీయాల్లోనూ కాదు..ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన డైలాగ్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న షిప్ ను సీజ్ చేయాలని కాకినాడ లో ఆదేశించారు. కానీ, అది సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇందుకు సాంకేతిక కారణాలను అధికారులు తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ నెల 3న జరిగే ఏపీ మంత్రివర్గంలోనూ బియ్యం అక్రమ రవాణా.. చర్యల పైన నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, తన ఆదేశాలు అమలులో డైలమా ఏర్పడిన వేళ పవన్ ఏం చేయబోతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి.

సీజ్ ది షిప్ అంటూ
ఢిల్లీ పర్యటన తరువాత పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి ఎన్నికల ప్రచారంలోనూ పవన్ ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జూలై నెలలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ కాకినాడలో అక్రమ బియ్యం రవాణా గుర్తించారు. సీఐడీ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు కాలేదు. ఇక, ఇప్పుడు పవన్ కాకినాడకు రావటం...బియ్యం రవాణా చేస్తున్న షిప్ ను పరిశీలించే ప్రయత్నం జరిగింది. తనను అడ్డుకుంటున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయం లోనే సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు. కేంద్రంతోనూ తాను మాట్లాడుతానని వ్యాఖ్యానించారు.

Big twist in implementation of Dy CM Pawan Kalyan orders on Seize the Ship

పవన్ హుకుం తో
పవన్ సీజ్ ది షిప్ అంటూ చేసిన హుకుం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అదే టైం లో కూటమి ప్రభుత్వంలో కలకలం మొదలైంది. ఇక, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు అసలు షిప్ సీజ్ చేయమనే అధికారం ఉందా. పోర్టు అధికారులకు ఆ మేరకు అధికారాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. షిప్ సీజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం వ్యవహరించా ల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బియ్యం స్మగ్లింగ్ చట్టం పరిధిలోకి రాదని పోర్టు అధికారులు వెల్లడించారు. నిషేధ జాబితాలో లేని వస్తువులతో రవాణా అవుతున్న షిప్ ను సీజ్ చేసే అంశం పైన తర్జన భర్జన పడుతున్నారు. సముద్రంలో ఉన్న షిప్ ను సీజ్ చేయాలంటే కోర్టు ద్వారానే సాధ్యం అని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

సీజ్ కు నో ఛాన్స్
పవన్ సీజ్ చేయాలంటూ ఆదేశించిన షిప్ పనామా స్టెల్ల, ఇది పనామా దేశానికి చెందిన కార్గో షిప్. ప్రస్తుతం ఇది వెస్ట్ ఆఫ్రికాకు వస్తువులను తరలిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నౌకలను సీజ్ చేయడం రాజ్యంగబద్ధమైన, న్యాయపరమైన అంశం. కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్, లేదా కేంద్ర ప్రభుత్వమే ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ షిప్ మన జలాల పరిధిలో ఉన్నా కూడా రాష్ట్రానికి ఈ విషయంలో అధికారాలు ఉండవని చెబుతున్నారు. ఏదైనా ఫిర్యాదుల ఉంటే అధికారిక సంస్థలైన కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో, పవన్ సీజ్ ది షిప్ అమలు సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో, పవన్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+