తిరుమల పరకామణి కేసులో బిగ్ ట్విస్ట్-హైకోర్టు సంచలన ఆదేశాలు..!

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో పరకామణిలో జరిగిన చోరీ కేసును సెటిల్ చేసుకున్న వ్యవహారంపై దాఖలైన కేసును విచారిస్తున్న హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులు టీటీడీతో సంబంధం లేకుండా సెటిల్ చేసుకున్నట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

తిరుమల పరకామణిలో గతంలో జరిగిన చోరీ వ్యవహారం ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఈ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న టీటీడీ ఉద్యోగి రవి కుమార్ , ఏవీఎస్వో సతీష్ కుమార్ గతంలో రాజీ చేసుకున్నారు. అయితే ఈ రాజీకి టీటీడీ అనుమతి లేదు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పరకామణి కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కేసులో ఇప్పటికే టిటిడి ఈఓ అనిల్ సింఘాల్ కౌంట్ కూడా దాఖలు చేశారు.

big twist in Tirumala parakamani theft case as high court orders CID inquiry

టిటిడి అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్,ఎవీఎస్వో సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్ లో ఈవో పేర్కొన్నారు. దీంతో పరకామణి కేసు అత్యవసరంగా సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలని హైకోర్టు గడువు కూడా పెట్టింది. అలాగే నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

big twist in Tirumala parakamani theft case as high court orders CID inquiry

గతంలో పరకామణి చోరీ కేసులో నిందితుల మధ్య లోక్ అదాలత్ లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది. దీంతో టీటీడీ పరకామణి చోరీ వ్యవహారంలో దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు టీటీడీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు నిందితులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలితే హైకోర్టు మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+