వివేకా హత్య కేసులో కీలక మలుపు - వెలుగులోకి కొత్త కోణం..!!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో దర్యాప్తు అధికారి..వివేకా కుమార్తె సునీత..నిందితుడు దస్తగిరి కుమ్మక్కై దర్యాప్తు అధికారి కోరినట్లుగా వాంగ్మూలం ఇచ్చినట్లు వైఎస్ భాస్కర రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఇదే సమయంలో సంచలన అంశాలను బయట పెట్టారు. చూసింది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది పేర్కొన్నారు.దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని వివరించారు.

వివేకా హత్య కేసులో దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించటాన్ని సవాలు చేస్తూ భాస్కరరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై జస్జిస్ సురేందర్ విచారణ చేపట్టారు. పిటీషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాచ్ మన్ రంగన్న నిందితులను గుర్తిస్తూ వాంగ్మూలం ఇచ్చారన్నారు. నిందితులు రాజకీయ, ఆర్డిక, వ్యక్తిగత కక్షతోనే వివేకాను హత్య చేసినట్లు వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. దస్తగిరి నేరుగా హత్య సంఘటనలో పాల్గొన్నారని..అలాంటి వ్యక్తిని ముందు అరెస్ట్ చేసి వాంగ్మూలం సేకరించాల్సి ఉండగా దానికి విరుద్దంగా ముందస్తు బెయిల్ కు కూడా సిబీఐ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. కస్టడీలో విచారణ అవసరం లేదన్నది ముందస్తు బెయిల్ కు కారణం కాదన్నారు.

YS Viveka Murder Case

వివేకా వారసున్ని ప్రకటించనున్న నేపథ్యంలో కుమార్తె, అల్లుడి పాత్రల పై చెప్పినా దర్యాప్తు అధికారులు కనీసం వారిని విచారించలేదన్నారు. దస్తగిరి మొదట ఇచ్చిన వాంగ్మూలంలో గానీ, సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో కానీ పిటీషనర్ పేరు లేదన్నారు. తండ్రిని కొట్టి, హత్య చేసిన ఘటనలో పాల్గొన్న వ్యక్తిని రక్షించటానికి వివేకా కుమార్తె ప్రయత్నిస్తున్నారా అనే దానికి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. అలాగే ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారం‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది.

యాదవ్ తల్లి‌ని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని.. దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో కొత్త ఐవో‌ను నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించింది. నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టెక్ ఔట్‌‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరి‌ని అప్రూవర్‌గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. తదుపరి విచారణ గురువారంకి కోర్టు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+