ఆశావాహులకు జలక్ : కొత్తగా 14-17 మందికే అవకాశం : ఆ మంత్రులు కంటిన్యూ - పీకే సూచనలతో..!!

ఏపీ కేబినెట్ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే 24 మంది మంత్రులు రాజీనామా చేసారు. కొత్త మంత్రులు 11న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. అయితే, ప్రస్తుత మంత్రుల్లో నలుగురు లేదా అయిదుగురు మాత్రమే కొనసాగుతారని ఇప్పటి వరకు అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, అనూహ్యంగా ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో..ఇప్పటి వరకు పలువురు ఆశావాహుల పేర్లు రేసులోకి వచ్చాయి. మారుతున్న పరిణామాలతో వారికి నిరాశ తప్పేలా లేదు. ఇక, ప్రస్తుత కేబినెట్ లో 7 -11 మంది వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

సీనియర్లకు ప్రాధాన్యత దక్కేలా

సీనియర్లకు ప్రాధాన్యత దక్కేలా

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సమయంలో.. సామాజిక సమీకరణాలతో పాటుగా అనుభవం సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో.. పూర్తిగా కొత్త వారితో ముందుకు వెళ్తే ప్రభుత్వం పరంగా సమస్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సీనియర్లు లేకుంటే.. ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

అదే సమయంలో సీనియర్లను తప్పించి వారికి పార్టీ పదవులు ఇస్తూనే..వారికి కేబినెట్ హోదా ఇచ్చినా...కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..కేబినెట్ లో సామాజిక సమీకరణాలు - జిల్లాల ఈక్వేషన్లు తో పాటుగా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో..ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో 7-11 మంది వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఎన్నికల టీం కావటంతో ఆచి తూచి

ఎన్నికల టీం కావటంతో ఆచి తూచి

పాలనా పరంగా అనుభవం ఉన్న వారిని తప్పించి..కొత్త వారికి కీలక శాఖలు అప్పగిస్తే ప్రభుత్వం పరంగా నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. కొత్తగా 14-15 మందికే ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో..ఎవరూ చివరికి ప్రమాణ స్వీకార సమాచారం వచ్చే వరకూ మంత్రిగా అవకాశం దక్కినట్లు కాదనే నిర్ణయానికి వస్తున్నారు.

సీనియర్లులో భాగంగా బొత్సా..పెద్దిరెడ్డి.. పేర్ని నాని.. కొడాలి నాని.. బాలినేని..ఆదిమూలపు సురేష్..జయరాం.. చెల్లుబోయిన వేణు..సిదిరి అప్పలరాజు..శ్రీరంగనాధ రాజు కొనసాగటం ఖాయమని తెలుస్తోంది. అయితే, బుగ్గన పేరు సైతం ప్రచారం లో ఉన్నా.. రెడ్డి వర్గానికి ఈ సారి మూడు స్థానాలకే పరిమితం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

పాలనా పరంగానూ కీలకంగా

పాలనా పరంగానూ కీలకంగా

ప్రస్తుతం పార్టీ పరిస్థితుల పైన క్షేత్ర స్థాయిలో సర్వలు చేయిస్తున్న నేపథ్యంలో.. పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం నుంచి కీలక సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు లో పెద్దిరెడ్డిని కొనసాగించాలని..అదే విధంగా ప్రకాశం లో మార్పులు సరి కాదని సూచించినట్లు సమాచారం. క్రిష్ణా జిల్లాలో పేర్ని నాని - కొడాలి నాని లను కొనసాగిస్తూనే బీసీ మంత్రిగా పార్ధసారధి.. జోగి రమేష్ లలో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది.

అయితే, ప్రస్తుత రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల నేపథ్యంలో మూడేళ్లుగా ఆ శాఖను పర్యవేక్షిస్తున్న బుగ్గన ను సైతం కొనసాగించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కానీ, సామాజిక వర్గాలు - జిల్లాల సమీకరణాల్లో ఎంత వరకు సాధ్యమనే సందేహం వ్యక్తం అవుతోంది.

Recommended Video

    AP New Districts: కొత్త జిల్లాలు - Registration Charges పెంపు | Oneindia Telugu
    సీఎం కూర్పు పై ఉత్కంఠ

    సీఎం కూర్పు పై ఉత్కంఠ

    ఓసీ వర్గాలకు కేబినెట్ బెర్తులు పరిమితం చేసి.. 15-16 వరకు బీసీ-ఎస్సీ-ఎస్టీలకు అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పటి వరకు కేబినెట్ లో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆశావాహులకు తాజాగా కూర్పుకు సంబంధించిన సమాచారం తో టెన్షన్ మొదలైంది.

    అదే విధంగా తమ పదవులు ముగిసాయని చెప్పిన మంత్రులు పేర్ని నాని - కొడాలి నాని వంటి వారికి తిరిగి కొనసాగే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో.. జగన్ తన తుది జాబితాలో ఎవరికి అవకాశం ఇస్తారో..ఎవరిని పక్కన పెడతారో.. అనే ఉత్కంఠ ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+