శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో బీహారీ ముఠా: పాలకొండలో ఒడిషా ముఠా

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/ శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పోలీసులు బీహారీ దొంగల ముఠాను పట్టుకోగా, శ్రీకాకుళం జిల్లాలో ఒడిషా దొంగల ముఠాను పట్టుకున్నారు. విశాఖపట్నం నగరంలో బ్యాంకుల వద్ద మాటువేసి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసేవారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న బీహర్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

క్రైమ్‌ ఏడీసీపీ ఎస్‌.వరదరాజులు గురువారం మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీహర్‌లోని కటియార్‌ జిల్లా జురబ్‌గంజ్‌ గ్రామానికి చెందిన సోదరులు నీరజ్‌కుమార్‌ యాదవ్‌, కాశీకుమార్‌ యాదవ్‌, శివకుమార్‌ యాదవ్‌ పాతనేరస్తులు. వీరు ముగ్గురూ తమ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నేరస్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

బీహారీ ముఠా సభ్యుడు

బీహారీ ముఠా సభ్యుడు

బీహారీ దొంగల ముఠాకు చెందిన ఓ సభ్యుడిని అరెస్టు చేసినట్లు, అతని నుంచి రూ.1.30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు విశాఖపట్నం క్రైం ఎడిసిపి వరదరాజులు చెప్పారు.

బీహారీ ముఠా సభ్యుడు

బీహారీ ముఠా సభ్యుడు

ఓ దొంగతనం కేసులో ముగ్గురు పాల్గొన్నారని, వారంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములని తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

బీహారీ ముఠా సభ్యుడు

బీహారీ ముఠా సభ్యుడు

ఆగస్టు నెలలో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వద్ద రూ.6 లక్షలు డ్రా చేసుకుని వెళ్తున్న తోట వెంకటేశ్వర రావు నుంచి డబ్బుల బ్యాగును లాక్కుని వెళ్లారని పోలీసులు చెప్పారు.

బీహారీ ముఠా సభ్యుడు

బీహారీ ముఠా సభ్యుడు

బిహారీ ముఠాకు చెందిన మిగతా సభ్యులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వరదరాజులు మీడియాకు చెప్పారు.

వీరంతా బృందాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు వచ్చి చోరీలకు పాల్పడి తిరిగి తమ స్వస్థలానికి వెళ్లిపోతుండేవారు. ఇందుకోసం బీహర్‌ నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని రైల్లో పార్శిల్‌ ద్వారా తాము ఎన్నుకున్న నగరానికి తీసుకుని వెళుతుంటారు. ఆ వాహనాన్నే తమ చోరీలకు వినియోగిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటారు. పైనపేర్కొన్న ముగ్గురు ఈ ఏడాది జూలై 31న నగరానికి చేరుకున్నారు.

ఇదిలా వుంటే, దొంగల ముఠాను ఒడిసా పోలీ సులు సినీఫక్కీలో ఛేజ్‌చేసి పట్టుకున్న ఘటన గురువారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చోటు చేసుకుంది. ఒడిషాలోని రాయగడకు చెందిన ఓ దొంగల ముఠా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్‌.కె.రాజపురంలో ఉన్నారన్న సమాచారంతో ఒడిషా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

దీన్ని పసిగట్టిన దొంగల ముఠా పంట పొలాలవైపు పరుగులు తీస్తూ పోలీసులపైకి రాళ్లు రువ్వ డంతో పోలీసులు కాల్పులు జరిపి వారినిపట్టుకున్నారు. దొంగల ము ఠా ఈ నెల 6న రాత్రి రాయగడ పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఎద్దుసాయివీధిలోని ఓఇంట్లో భారీ చోరీకి పాల్పడినట్టు ఒడిసా పోలీసుల ద్వారా తెలిసింది. ఈ చోరీలో 1.50 కోట్లువిలువచేసే నగదుతో పాటు బంగరు అభరణాలను తస్కరించినట్టు కేసు నమోదైంది.

English summary
Police have nabbed gangs from Bihar and Odisha in Visakhapatnam and Srikakulam districts for resorting thefts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X