Bill Gates: అమరావతికి బిల్ గేట్స్-టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే..!

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (bill gates) ఈనెల 16న రాష్ట్రానికి రానున్నారు. తన గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల్ని సందర్శించడంతో పాటు ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్నారు. బిల్ గేట్స్ రాకకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న సంజీవని ప్రాజెక్టును కూడా బిల్ గేట్స్ పరిశీలిస్తారు.

ఈ నెల 16 తేదీ ఏపీలో గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్, ఫౌండేషన్ ప్రతినిధి బృందం పర్యటించనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై వీరు చర్చిస్తారు.

Bill Gates Feb 16 Amaravati Visit Review of Sanjeevani and Gates Foundation Works

16 తేదీ ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. అక్కడి ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తారు. అనంతరం గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమవుతున్నారు. ఇందులో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇస్తారు.

Bill Gates Feb 16 Amaravati Visit Review of Sanjeevani and Gates Foundation Works

మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు గేట్స్ కు వివరిస్తారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి ఆయనకు వివరిస్తారు. అనంతరం అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్ గేట్స్ బృందం.. అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనున్నారు. అక్కడితో గేట్స్ టీమ్ పర్యటన పూర్తవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+