టి బిల్లు 'త్వరలోనే': షిండే, ఈ సెషన్లో అని స్పష్టత లేదా?

Sushilkumar Shinde
న్యూఢిల్లీ/ముంబై: తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన విభజన ముసాయిదా బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదిస్తారా? అంటే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మరోసారి స్పష్టత ఇవ్వలేదు. షిండే ఆదివారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు పరిశీలనకు వస్తుందన్నారు తప్ప శీతాకాల సమావేశాల్లో కచ్చితంగా వస్తుందనేది చెప్పలేకపోయారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టి.బిల్లు ప్రతిపాదిస్తారా? లేదా? అంటూ మీడియా పదేపదే అడిగినా షిండే మాత్రం త్వరలోనే వస్తుందంటూ దాటవేశారు తప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాష్ట్ర విభజన పనులు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసిన జివోఎం పని దాదాపుగా పూర్తయిందని చెప్పారు.

జివోఎం తయారు చేసిన నివేదికపై న్యాయ శాఖ సలహా తీసుకున్న వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిస్తామని షిండే తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన వెంటనే తెలంగాణ బిల్లును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపిస్తామన్నారు. టి.బిల్లు రాష్టప్రతి నుంచి శాసన సభకు వెళ్తుందని షిండే వివరించారు.

డిగ్గీతో డిఎస్

ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో డి శ్రీనివాస్ ఆదివారం భేటీ అయ్యారు. సిడబ్ల్యూసి తీర్మానించినట్లు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే తమకు కావాలని, రాయల తెలంగాణ వద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సోమ, మంగళ వారాల్లో ఆయన సోనియా సహా ఇతర నేతలను కలిసి రాయల తెలంగాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+