టీడీపీతో పొత్తు పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు - ఆధారపడం..!!
ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలు కీలకంగా మారుతున్నాయి. ఏపీలో తిరిగి కూటమిగా పోట చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. ఎన్డీఏలోకి తిరిగి టీడీపీ చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే వారం పొత్తులు, సీట్లకు సంబంధించి నిర్ణయం వెల్లడి కానుంది. ఈ సమయంలోనే సీట్ల సర్దుబాటు పై చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. ఇక..పొత్తుల పైన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
పొత్తుల రాజకీయం : ఏపీలో పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ పురందేశ్వరి స్పందించారు. పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలూ చేపట్టబోమని.. పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు. ముందు తమ ప్రయత్నాలన్నీ బీజేపీ బలోపేతం కోసమేనని చెప్పుకొచ్చారు. బీజేపీ అధిష్ఠానం సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

పురందేశ్వరి వ్యాఖ్యలు : టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురందేశ్వరి స్పష్టం చేశారు. ముగ్గురు పార్టీ అగ్ర నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురందేశ్వరి స్పష్టం చేశారు.
సీట్ల షేరింగ్ కీలకం : చంద్రబాబుతో అమిత్ షా పొత్తుల పైన చర్చల తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అటు చంద్రబాబుతో చర్చలు..ఇటు జగన్ తో ప్రధాని భేటీ తో రాజకీయంగా ఏపీలో బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తుందనే సందిగ్ధత ఏర్పడింది. రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు పొత్తుల పైన అధికారిక స్పందన లేదు. తాజాగా హోం మంత్రి అమిత్ షా ఏపీలో పొత్తుల పైన త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో, టీడీపీతోనే పొత్తు ఖాయమవుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్ల పైన కసరత్తు జరుగుతోంది. అయితే, పొత్తుల పైన అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications