టిపై సీమాంధ్ర బిజెపి, తేడా వస్తే యుద్ధమేనని కెసిఆర్

తేడా వస్తే యుద్ధమే: కెసిఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన కేంద్రం కొర్రి పెట్టే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మధ్యాహ్నం తెరాస రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించే అవకాశముందన్నారు. తేడా వస్తే యుద్ధానికి సిద్ధం కావాలని నాయకులకు చెప్పారు. అంతకుముందు కాంగ్రెసులో విలీనం ఉండదని తేల్చిన విషయం తెలిసిందే.
కార్యదర్శులతో హోంశాఖ భేటీ
రాష్ట్ర విభజన అంశంపై హోంశాఖ భేటీ అయింది. ఈ భేటీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన జరుగుతోంది. పెట్రోలియం, గ్రామీణాభివృద్ధి, హోంశాఖ, జలవనరులు, వైద్య శాఖలకు సంబంధించిన కార్యదర్శులు భేటీలో పాల్గొన్నారు. ఎపి విభజన, విధివిధానాల ఖరారుపై వారు చర్చిస్తున్నారు.
సోనియాతో గవర్నర్ భేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications