వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకూ బిజెపి పోటీ...చంద్రబాబు పన్నాగం: కన్నా లక్ష్మీనారాయణ

విశాఖపట్టణం: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీటకూ బీజేపీ పోటీ చేసి, విజయకేతనం ఎగురవేస్తుందని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తున్నదని, పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

శనివారం విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను టిడిపి ప్రభుత్వం వివిధ పధకాల పేరుతో స్వాహా చేస్తోందని ఆరోపించారు. నిధులు కేంద్రానివి కాగా అవినీతి రాష్ట్రానిది అని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.

 కేంద్రం నిధులు...టిడిపి అవినీతి

కేంద్రం నిధులు...టిడిపి అవినీతి

అన్నవరంలో పర్యటన సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ..."ఎన్టీఆర్‌ గృహకల్ప, చంద్రన్న భీమా, నీరుచెట్టు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ యువతకు అందిస్తున్న రుణాలు పూర్తిగా కేంద్రానివే...నిధులు మావి, అవినీతి వారిది...అని టిడిపి ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.

స్టీల్ ప్లాంటు...ఏర్పాటుకు సిద్దమే

స్టీల్ ప్లాంటు...ఏర్పాటుకు సిద్దమే

కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సాంకేతిక కారణాలతో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి వీలు పడదని సెయిల్‌ గతంలో ప్రకటించింది. అయినప్పటికీ దీని ఏర్పాటు విషయమై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకెళ్తున్నారని కన్నా చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పన్నాగం...కారణాలు ఇవే!

చంద్రబాబు పన్నాగం...కారణాలు ఇవే!

కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ ఒక వైపు కృషి చేస్తుంటే...మరోవైపు టీడీపీ ఎంపీలు నిరాహార దీక్షలు చేయడమేమిటని కన్నా మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు పన్నాగమే అన్నారు. చంద్రబాబు తన అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని, బీజేపీ నాయకులను దోషులుగా చూపించే కుట్ర పన్నుతున్నారని కన్నా ఆరోపించారు.

ఇతర ప్రాజెక్టుల...విషయంలోనూ!

ఇతర ప్రాజెక్టుల...విషయంలోనూ!

ప్రత్యేక రైల్వే జోన్‌, దుగరాజపట్నం పోర్టుపైనా కేంద్రం సానుకూలంగా ఉందని కన్నా తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు ఇస్రో సాంకేతిక కారణాలతో అభ్యంతరాలు చెప్పిందన్నారు. చంద్రబాబు దానికి ప్రత్యామ్నాయం చూపకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి రాజ్యసభలో పూర్తి మద్దతు లేనందున బిల్లు నిలిచిపోయిందని కన్నా ఈ సందర్భంగా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+