Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నందమూరి వారసులే అస్త్రం, బీజేపీ కొత్త గేమ్ - టార్గెట్ ఫిక్స్..!!

బీజేపీ నాయకత్వం ఆపరేషన్ ఏపీ ప్రారంభించింది. టీడీపీ లక్ష్యంగా పావులు కదుపుతోంది. నందమూరి కుటుంబాన్ని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. రానున్న ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారాయి. అటు సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఇటు బీజేపీ కలిసి వస్తుందా రాదా అనేది స్పష్టత రావటం లేదు. ఈ సమయంలోనే అనూహ్య నిర్ణయాలతో తమ లక్ష్యం స్పష్టం చేసింది. టీడీపీ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. నందమూరి వారసులతో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది.

టీడీపీ కి ఇబ్బందులేనా:జనసేనాని పవన్ తాము టీడీపీతో పాటుగా బీజేపీతోనూ కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ మేరకు బీజేపీకి ప్రతిపాదన చేసారు. నేరుగా అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు మంతనాలు చేసారు. ఇక పవన్ చెప్పినట్లే పొత్తులు ఖాయం అవుతున్నాయనే ప్రచారం సాగింది. కానీ స్పష్టత మాత్రం లేదు.

BJP giving priority for Nandamuri Family with big plan in AP Politics,Target Fix

ఈ సమయంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడిని మార్చింది. ఏపీలో నందమూరి వారసురాలు పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను గుర్తించి పక్కా లెక్క ప్రకారం ముందుకు వెళ్తోంది. పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగిస్తోంది. బీజేపీ ఏపీ చీఫ్ గా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చింది. అటు జూ ఎన్టీఆర్ తో సమావేశం తరువాత రాజకీయంగా కీలక సంకేతాలు ఇచ్చింది. పురందేశ్వరి..తారక్ ఇద్దరూ చంద్రబాబు..టీడీపీ వ్యహారాలకు దూరం.

రెండు పార్టీలకు ధీటుగా:ఇప్పుడు పొత్తుల ద్వారానే జగన్ ను ఓడించలమని టీడీపీ విశ్వసిస్తోంది. పవన్ ప్రస్తుతం బీజేపీతోనే ఉన్నా... బీజేపి కలిసి వచ్చినా రాకున్న అనూహ్య పరిణామలు జరిగితే మినహా టీడీపీతో కలిసి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ టీడీపీకి మద్దతుగా ఉన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి జాతీయ పార్టీకి ఎన్టీఆర్ కుమార్తె రాష్ట్రంలో అధ్యక్షురాలు అయ్యారు. దీని ద్వారా నందమూరి అభిమానుల్లో ..టీడీపీకి అండగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చనేది బీజేపీ వ్యూహం. అందులో భాగంగానే అటు పవన్..ఇటు పురందేశ్వరిని నమ్ముకొని బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినా.. బీజేపీ ఇప్పుడు అమలు చేస్తున్న ఆపరేషన్ సక్సెస్ అయితే ప్రభావం పడేది మాత్రం టీడీపీ ఓట్ బ్యాంక్ మీదేననే విశ్లేషణలు మొదలయ్యాయి.

BJP giving priority for Nandamuri Family with big plan in AP Politics,Target Fix

పురందేశ్వరి సమర్ధతకు పరీక్షగా:రాజకీయంగా చంద్రబాబుతో పురందేశ్వరి దంపతులు విభేదించి..సొంత దారి చూసుకున్నారు. 2004లో కాంగ్రెస్, 2014లో బీజేపీలో చేరి టీడీపీ ఊసెత్తకుండా ముందుకెళ్తున్నారు. పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించటం వెనుక బీజేపీ నాయకత్వానికి భారీ అంచనాలు ఉన్నాయి.

ఏపీ బీజేపీలోని నేతలు కొందరు టీడీపీకి అనుకూలంగా..మరి కొందరు వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో పార్టీ లైన్ ప్రకారం అందరినీ సమన్వయం చేసుకుంటే ముందుకెళ్లే బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించారు. వైసీపీ పైన కొంత కాలంగా పురందేశ్వరి సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ పైనా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా స్పందించక తప్పని పరిస్థితి. దీంతో, కీలకమైన ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ కుమార్తెగా..టీడీపీ, జనసేనకు ధీటుగా పార్టీని నడిపించటంలో ఏ మేర సక్సెస్ అవుతారనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+