వెంకయ్యనే అంటారా.. రెండు దున్నపోతుల్లా..: జగన్-పవన్‌లపై బీజేపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల పైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాజీ వేమా తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ల పైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాజీ వేమా తీవ్రంగా మండిపడ్డారు. దున్నపోతుల్లా అంటూ ఊగిపోయారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన జగన్, పవన్ విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు దున్నపోతుల్లా వెంకయ్య పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లు ఉండీ చూడలేకపోతున్నారని, కళ్లున్న కబోదుల్లా మారారని విమర్శించారు. వెంకయ్య కుమార్తె స్థాపించిన స్వర్ణభారతి ట్రస్టు పైన పెట్టిన శ్రద్ధ హోదా కోసం పెట్టడం లేదని పవన్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

స్వర్ణభారతిలో మహిళలకు కుట్టుపని, తదితర శిక్షణలు ఇచ్చి వారి కాళ్ల పైన వారు నిలబడేలా చేస్తున్నారని, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనిని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. స్వర్ణభారతి ప్రజా సేవ చేస్తోందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోడీతో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతానని ప్రజలకు చెబుతూ, ఏ రోజూ మాట్లాడలేదని పవన్ పైన నిప్పులు చెరిగారు. వారితో మాట్లాడతానని ప్రజలను మభ్యపెడుతున్నారని, అబద్దాలు చెబుతున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications