ప్రమాదం, బిజెపి నేతకు గాయాలు, పవన్ పరామర్శ

BJP leader injured in an accident
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి విజయ భర్త మోహన్ రెడ్డి గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డిని శనివారం పరామర్శించారు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బిజెపి అభ్యర్థి విజయ భర్త కొట్టాల మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి రామన్నపల్లెలో ఆయన ప్రచారం ముగించుకుని కార్యకర్తలతో కలిసి తిరిగి వస్తుండగా.. తంగళ్లపల్లి నుంచి సిద్దిపేటకు ఇసుకతో వెళ్తున్న పికప్ (ట్రాలీ ట్రక్కు) వీరు కారును ఢీ కొట్టింది.

ఆ తాకిడికి కారు బోల్తా పడి, మోహన్ రెడ్డి, డ్రైవర్, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని మొదట సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాదుకు తరలించారు. కాగా, తమకు కారు ప్రమాదంపై అనుమానాలున్నాయని మోహన్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.

మరోవైపు మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ అనురాధ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో స్వల్ప గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+