రాజధాని విషయంలో పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు ... ఆమెదీ వైసీపీ నేతల మాటే !!
Recommended Video
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజధాని అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధానిగా అమరావతి ఉండాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో చాలా మంది రాజధాని వికేంద్రీకరణ జరగాలనే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా వ్యక్తం చేసిన నాయకులు వైసీపీ నుండే ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఆ కోవలో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి కూడా చేరిపోయారు. హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి రాజధాని విషయంలో జరగకూడదని సూచించారు దగ్గుపాటి పురంధరేశ్వరి .

హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు ఇప్పుడు ఏపీలో చెయ్యకూడదు అన్న పురంధరేశ్వరి
కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. గతంలో కేవలం హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చెయ్యటం వల్ల రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నష్టపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటె బాగుంటుంది అని ఆమె పేర్కొన్నారు. అందుకే రాజధాని వికేంద్రీకరణ అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఏపీ సీఎం వైయస్ జగన్ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని తన మాట తమ నేతల నోట చెప్పిస్తున్నారు. తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు జగన్ నిర్ణయాలకు పరోక్షంగా మద్దతు పలికినట్లు అన్న భావన వ్యక్తం అవుతుంది .

అధికార వికేంద్రీకరణ అవసరం అంటున్న బీజేపీ నేత పురంధరేశ్వరి
రాజధాని నిర్మాణం అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన పురంధేశ్వరి, ఈ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోబోదు అని చెప్పుకొచ్చారు. నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. కానీ అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.ఇక గత చంద్రబాబు ప్రభుత్వంప విమర్శలు గుప్పించిన పురంధరేశ్వరి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిధులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు పక్క దారి పట్టాయని చెప్పిన ఆమె ప్రస్తుత ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని అన్నారు.

జగన్ సర్కార్ నిర్ణయానికి పురంధరేశ్వరి మద్దతు
ఇక ఏపీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమని పురంధేశ్వరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ అని అయితే అది కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు పురంధరేశ్వరి . రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే వయోభారంతో బాధపడుతున్న సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారంటూ ఆమె ఎద్దేవా చేశారు . ఇక జగన్ ప్రభుత్వం ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో రాజధాని వికేంద్రీకరణ జరగాలని హైదరాబాద్ లా తప్పు జరగకూడదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి .
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications