అందుకే వారిని విచారించలేదు: ప్రణయ్ హత్యపై బీజేపీ నేత, అమృతకు హామీ
మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు పరామర్శించారు. ప్రణయ్ హత్య కేసు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేతేపల్లి పోలీసు స్టేషన్లో ప్రణయ్ తండ్రి బాలస్వామికి వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదు చేయించిన విషయంలో తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తముందని ఆరోపణలు రాగా, అతనిని పోలీసులు విచారించలేదని ఆరోపించారు.

అమృతను అబార్షన్ చేయించుకోవాలని సూచించిన సోమా భరత్ కుమార్‌ను సైతం పోలీసులు విచారించలేదని చెప్పారు. వీరిద్దరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి శిష్యులు కాబట్టే విచారణ చేయకుండా వదిలేశారని ఆరోపించారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంకినేని అమృతతో మాట్లాడటంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సెల్ ఫోన్లో మాట్లాడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications