సీబీఐ కేసుల కోసమేనా పార్లమెంటులో ప్రశ్నలు ? వైసీపీ ఎంపీలపై బీజేపీ సత్యకుమార్ ఫైర్
ఎప్పుడో ముగిసిపోయిన ప్రత్యేక హోదా అధ్యాయాన్ని తిరిగి పార్లమెంటులో లేవనెత్తడం సరికాదని బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ తెలిపారు. వైసీపీ ఎంపీలు సీబీఐ కేసుల కోసమే అడుగుతున్నట్లుందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి వేస్తున్న ప్రశ్నలు బీజేపీని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వరుసగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఇవాళ వైసీపీ ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ధి కోసం విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని, విశాఖ మెట్రో నిర్మాణం విభజన చట్టంలో ఉందని సత్యకుమార్ తెలిపారు.రివైజ్ డి.పి.ఆర్ సమర్పించకుండా ఇచ్చినట్లు చెబుతున్నారని సత్యకుమార్ ఆరోపించారు. ఐదేళ్ల పాటు కాలయాపన చేశారని, దీనికి కారణాలు తెలియదన్నారు. ఇప్పుడు హఠాత్తుగా అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.
కేంద్రం అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ పడదని సత్యకుమార్ తెలిపారు. సీబీఐ కేసుల నేపథ్యంలో వారు కొత్త గా మాట్లాడుతున్నారేమో అని సెటైర్లు వేశారు. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ఏపీ వాటా కింద నిధులు, స్థలాలు ఇవ్వడం లేదన్నారు. అప్పటి సిఎం వై.యస్.తో చేసుకున్న ఒప్పందాలే ఇవన్నీ అన్నారు. తనయుడిగా జగన్ తండ్రి ఒప్పందాలను అమలు చేయడం లేదన్నారు.

కేవలం ఐదు వేల కోట్లు ఇవ్వక పోవడం వల్ల పలు ప్రాజెక్టు లు ఆగిపోయాయన్నారు. స్టీల్ ఫ్లాంట్, దుగరాజ పట్నం, మెట్రో వంటివి మీరే పూర్తి చేస్తాం అని చెప్పారన్నారు.మిగిలిన ఏడు ప్రాజెక్టు లు కేంద్రం పూర్తి చేసింది కదా అని గుర్తుచేశారు. ఈ మూడు మీ నిర్లక్ష్యం వల్లే ఆగింది వాస్తవం కాదా అని సత్యకుమార్ ప్రశ్నించారు.
అబద్దాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తారా అని సత్యకుమార్ వైసీపీ ఎంపీల్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ అయినా తెచ్చిందా అని అడిగారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించడం వెనుక కారణాలు ఏమిటో అని నిలదీశారు. అన్ని అంశాలు విభజన చట్టంలోచేర్చిన వారు, హోదా ఎందుకు చేర్చలేదన్నారు.ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ ని ప్రశ్నించ లేదన్నారు.
అమరావతి విషయంలో తీర్మానం చేసి... అధికారంలోకి వచ్చాక రైతుల నోటిలో మట్టి కొట్టారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంటున్న వారు, అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్యాకేజీ గురించి ఎందుకు మాట్లాడారో అని ప్రశ్నించారు. కేంద్రం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్యాకేజీ కి కట్టుబడి ఉందన్నారు.హోదా వల్ల వచ్చే లాభాలను ప్యాకేజీ రూపంలో ఇస్తున్నామన్నారు.

మమ్మలను నిందించే వారు ముందు మీ మోసాలను గుర్తించండని వైసీపీకి సత్యకుమార్ సూచించారు. మీకొక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. 151సీట్లు వచ్చాయని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. యువతరాలకు భవిష్యత్తు లేకుండా చేసి... అప్పులు మిగిల్చారన్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వైసీపీ నాయకులు పోలవరం గురించి మాట్లాడరన్నారు.
గత ప్రభుత్వం అవినీతి చేసిందని పుస్తకాలు విడుదల చేశారని, వారిపై విచారణ చేసి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అభివృద్ధి అంటే తెలియని వారు మా మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను మరోసారి మోసం చేయడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, గ్రామాల నిధులు మళ్లించారన్నారు. సలహాదారులకు జీతాలు ఇస్తారు, ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు వేయరన్నారు. వైసీపీ నాయకులకు బిజెపి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications