ఊహించని నేతకు ఏపీ బీజేపీ పగ్గాలు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీలు కూటమిగా అధికారంలో కొనసాగుతూ సొంతంగా ఎదిగేలా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నాయి. బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవటానికి ఇదే సరైన సమయంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగా ఏపీ పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం పైన సుదీర్ఘ కసరత్తు చేసింది. సామాజిక - ప్రాంతీ య సమీకరణాలను పరిగణలోకి తీసుకొని.. చివరగా సీమ ప్రాంతానికి పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏపీ నూతన అధ్యక్షుడిగా
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సొంతంగా బలోపేతం కావటం పైన కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో, ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. రాయలసీమ కు చెందిన సీనియర్ పార్టీ నేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే, తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో రాయలసీమ ప్రాతం నుంచి ఈ సారి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయిన మేరకు నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

bjp-leader-ship-almost-finalised-the-new-president-for-ap

సీమ నుంచి కొత్తగా
ఏపీలో మారుతున్న రాజకీయాలతో బీజేపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. భవిష్యత్ పార్టీ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. టీడీపీ, జనసేనతో పొత్తు కొనసాగుతున్న వేళ రెడ్డి సామాజిక వర్గానికి లేదా బీసీ నుంచి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఆలోచన చేసారు. ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు తుది పరిశీలన వరకు వచ్చాయి. అయితే, పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేతకు పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ జీవీఎల్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అదే సమయంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక వేళ.. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని మరో ఏడాది పాటు పొడిగించే ప్రతిపాదన పైన చర్చ జరిగినట్లు సమాచారం.

Take a Poll

కొత్త వ్యూహాలు
ఇక.. బీజేపీ అధ్యక్షుడిగా పులివెందుల కు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈయన కోసం ఇదే జిల్లా వాసి.. ఉత్తరాంధ్ర ఎంపీగా ఉన్న నేత ఢిల్లీలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కొత్తగా అనంతపురం కు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి పేరు పైన హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఏబీవీపీ నుంచి పార్టీలో పలు హోదాల్లో పని చేసిన విష్ణు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా గుర్తింపు ఉన్న విష్ణు.. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ పార్టీ తరపున ప్రచారం చేసారు. దీంతో.. విష్ణు పేరు పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా రాయలసీమ నేతకే ఏపీ బీజేపీ పగ్గాలు అందటం ఖాయం గా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+